ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, ఆగస్టు 14 (జనం సాక్షి);
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల నుండి వచ్చిన పిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐ డి ఓ సి సమావేశం హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి లో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ద్వారా 80 ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ కు వివరించారు. ప్రజల నుండి వచ్చిన పిర్యాదుల లో ఆసరా పెన్షన్ కు సంబంధించి 6 ధరఖాస్తులు,భూ సమస్యలు ఇతర సమస్యల కు సంబంధించి 74 ధరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా శాఖల జిల్లా అధికారులు సంబంధిత మండల అధికారులు వారి పరిధిలోని ధరఖాస్తులు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కి వస్తున్న ప్రతిఒక్కరి ధరఖాస్తుపై సంబంధిత శాఖల అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 77వ స్వతంత్ర దినోత్సవము సందర్భంగా మంగళ వారం ఉదయం 10:30 గంటలకు నూతన కలెక్టర్ కార్యాలయంలో పతాకావిష్కరణగవించాబడునని, తదనంతరం 11:00 గంటలకు టి.పద్మారావు డిప్యూటి స్పీకర్ పొలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరుగు పతాక ఆవిష్కరణ, పోలీస్ వందన స్వీకరణ కార్యక్రమము నందు పాల్గొంటారని తెలిపారు.నూతన కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జరుగు పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రతి జిల్లా అధికారి , సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలని అధికారులకు ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖలు పరేడ్ గ్రౌండ్ లో స్టాళ్లను , త్రాగునీరు , వైద్య సదుపాయం తదితర ఏర్పాట్లు చేయాలన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ , అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాసులు , ఆర్ డి ఓ చంద్రకళ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.