ప్రజల సంక్షేమం కోసం మా సమస్యలు తీర్చండి – 16 గ్రామ సర్పంచ్ లు పంచాయతీ కార్మికుల సమ్మెకు మద్దతు
వీర్నపల్లి, ఆగస్టు 05 (జనంసాక్షి): రోజున వీర్నపల్లి మండల కేంద్రములో గ్రామ పంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె 30వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు అన్ని గ్రామ పంచాయతీ కార్మికులు పనులు (విధులు) బంద్ చేసి, సమ్మె చేస్తున్నాము సమ్మెకు మండల సర్పంచ్లు ఫోరం అధ్యక్షులు ఎడ్ల లక్ష్మి రాజం (సాగర్) తో పాటు, 16 గ్రామ పంచాయతీ సర్పంచ్ లు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం మద్దతు తెలిపినట్లు గ్రామ పంచాయతీ కార్మిక మండల కమిటీ అధ్యక్షుడు లద్దూరి నర్సయ్య తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలిపిన పత్రాన్ని వీర్నపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారికి అందించారు. 51 జి. వో రద్దు చేయాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. చాలిచాలని చాలని జీతలతో జీవనం సాగిస్తున్నట్లు వారు తెలిపారు. 60 జీవో ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని, ప్రమాద భీమా 10 లక్షలు చెల్లించి, కారోబార్, బిల్ కలెక్టర్లుకు పంచాయతీ సహాయ కార్యదర్శిగా నియమించడానికి వెంటనే ప్రభుత్వానికి సిఫార్సులు పంపాలని ఎంపిడిఒను కోరారు. గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నందున ఎక్కుడ చెత్తా అక్కడ పేరుపొయి, సిబ్బంది పనులు చేయలేకపోవడం వలన చెత్తా, మురికి నీటి కాలువలు శుభ్రం చేయక నిండి పోయి కాలుష్యము ఎక్కువ అయిపోతుందన్నారు. ప్రజలు అపరిశుభ్రత పాలయి, రోగాల భారిన అవకాశం ఉందని, వర్షాకాలం కావడం వలన మురికికి ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారన్నారు. ప్రజల సంక్షేమం కోసమే పాటుపడే గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, విధుల్లో చేరే విధంగా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని మండల సర్పంచులు అందరూ కూడా వారికి మద్దతు తెలిపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు శేఖర్, నర్సయ్య, సురేష్, శ్రీనివాస్, కమల్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.