ప్రజాప్రతినిధుల మాటలు నీటి మీది రాతలేనా. – నెన్నెల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దాగం రమేష్.

బెల్లంపల్లి, జులై 21, (జనంసాక్షి ) ప్రజాప్రతినిధులు మాటలు నీటి మీది రాతలేనా నెన్నెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాగం రమేష్ ప్రశ్నించారు. బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని ఎర్రవాగును శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. ఈసందర్భంగా నెన్నెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాగం రమేష్ మాట్లాడుతూ నెన్నెల మండల కేంద్రం నుంచి మన్నేగుడెం, కర్జీ, కోణంపేట, జంగల్ పెట్, బోగంపల్లి, పాటి, దమ్మీరెడ్డి పెట్, కూర్మగుడం 8 గ్రామాలు బాహ్య ప్రపంచానికి దూరం అయ్యాయని ఆరోపించారు. ఏళ్ల తరబడి భారీ వర్షాలతో ఎర్ర వాగు పొంగుతుండటంతో భారీ నీటి ప్రవాహం వాళ్ల 8 గ్రామాల ప్రజలతో పాటు నిత్యం పనులకోసం వెళ్ళేవారు వాగు దాటలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రోజుల తరబడి తుఫాన్ వచ్చినప్పుడు అయా గ్రామాల ప్రజలు ఉపాధి కోసం, కులి పనుల కోసం వివిధ పట్టణాలకు వెళ్ళడానికి వేరొక మార్గం లేక పోవడంతో పేదలకు పూట గడవని పరిస్తితి ఏర్పండిందన్నారు. గత ఏడాది భారీ వర్షాలు కురిసినప్పుడు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సందర్శించి కల్వర్ట్ తాత్కాలిక మర్మత్తుల కోసం 5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని, అయితే ఆ రోజు నుండి ఇప్పటివరకు మరమ్మత్తుల పనులు చేపట్టలేదన్నారు. ఎర్ర వాగు వంతెన నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారని, ఈప్రకటన కూడా గత ఏడాది హామీలా నీటి మూటలేనా అని విమర్శించారు. ఇప్పటికైన ప్రజలు పడుతున్నా రవాణా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎర్రవాగుపై వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమ్ము రాజేష్, యూత్ అధ్యక్షుడు లావుడ్య రమేష్, డీసీసీ సభ్యులు గట్టు బానేశ్, ఓబీసీ నాయకుడు తమ్మినవేణి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు