ప్రజా గొంతుకై పోరాడిన గద్దర్ చిరస్మరణీయుడు
పాటతో చైతన్యం తెచ్చిన గద్దర్
సీనియర్ పాత్రికేయులు మునీర్
ప్రత్యేక రాష్ట్ర సాధనలో గద్దర్ కృషి
తెలంగాణాలో ప్రజా గొంతుకై, మళి, తుదివిడత తెలంగాణా పోరాటంలో గద్దర్ పాల్గొని ప్రత్యేక రాష్ట్ర సాధనలో తనదైన ముద్ర వేసిన ప్రజాయద్దనౌక, ప్రజాకవి, గాయకుడు గద్దర్ చిరస్మరనీయుడని, తెలంగాణా ప్రజలు మరిచి పోలేరని ప్రజాప్రతినిధులు సష్పష్టం చేశారు. మంగళవారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో చైతన్య
యూత్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ జక్కుల రాజేశం, మాజీ వైస్ ఎంపీపీ పానగంటి సత్తయ్యల ఆద్వర్యంలో నిర్వహించిన గద్దర్ సంతాప సభలో వక్తలు పాల్గొని గద్దర్ పోరాటాలు, తన పాటలు నెమరు వేసుకొని స్మరించారు. కోల్బెల్ట్
సీనియర్ రిపోర్టర్ ఎండీ మునీర్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షులు అన్నయ్య, మల్లారెడ్డి, సంతాప సభ
నిర్వాహకులు టీబీజీకేస్ బ్రాంచి కార్యదర్శి పానగంటి సత్తయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కే శంకర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య పాల్గొని గద్దర్ చిత్రపటానికి పూళమాళలు వేసి నివాళులు అర్పించారు.
రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఆనంతరం కళాకారులు గద్దర్ పోరాటాలను స్మరిస్తు పాడిన పాటలు అందరినీ కళిచివేసింది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ మునీర్ మట్లాడుతు జర్నలిస్టుల తెలంగాణా
జాతాలో గద్దర్ పాల్గొని ప్రజలను పోరాటాలకు చైత్యన పరిచారని చెప్పారు. ప్రజల పక్షాణ నిరంతరం పోరాడుతు, ప్రభుత్వాలను ప్రశ్నించే గొంతుగా ఉండే గద్దర్ ఇక లేరనే మాటను తెలంగాణా ప్రజలు తట్టుకోలేక పోతున్నారని అన్నారు. కళా, సాహితీ రంగానికి గద్దర్ మృతి తీరని లోటన్నారు. కళాకారులకు ఒక
పెద్దదిక్కులా, ఆటా, పాటలతో తన అభినయనంతో ప్రజాకర్షకుడిగా నిలిచిపోయారని చెప్పారు. సింగరేణి కార్మికులతో గద్దరు విడదీయలేని అనుబందం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వంగ తిరుపతి, ఆర్
చంద్రశేఖర్, అగల్గూటి రాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, టీబీజీకేఎస్ కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్రెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధి పెట్టం లక్ష్మణ్, నాయకులు కొప్పర్తి రాజం, మధూసూదన్, నూనె మల్లయ్య, జోగుల మల్లయ్య, గుమ్మడి శ్రీనివాస్, గరిసె రామస్వామి, జంపయ్య, పురుషోత్తం, అఫ్రోజ్ఖాన్, రాజేశ్వర్రావు, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు