ప్రజా సమస్యల పరిష్కారం కోసమే గ్రామాల్లో పర్యటన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
వికారాబాద్ రూరల్ జులై 10 జనం సాక్షిమారుమూల గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ప్రజలతో చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తున్నామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండల పరిధిలోని ఎల్లకొండ గ్రామంలో శుభోదయం కార్యక్రమం ద్వారా గడపగడపకు తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని అర్హులకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాడని పేర్కొన్నారు. సంక్షేమ ఫలాలు అర్హులకు దక్కుతున్నాయా లేదా అనే కోణంలో పరిశీలించడానికి శుభోదయం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా అధికారులు చర్య తీసుకోవాలని ఆదేశించారు. మిషన్ భగీరథ మంచినీళ్ల వల
త్రాగునీటికి గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవలసిన బాధ్యత అధికారులదే అని అన్నారు. ప్రస్తుతం వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎల్లకొండ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు, స్థానిక సర్పంచ్ రావు గారి వెంకట్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి వెంకటలక్ష్మి, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కందాడ నాగిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పోలీస్ రామ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, దాతాపూర్ సర్పంచ్ బలవంత్ రెడ్డి, గేట్ వనంపల్లి సర్పంచ్ రత్నం, మాదిరెడ్డిపల్లి సర్పంచ్ ప్రభాకర్, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు
పాల్గొన్నారు.