ప్రతి ఇంట జాతీయ జెండా కార్యక్రమంలో పాల్గొన్న భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ముధోల్ భాజపా నాయకులు పవార్ రామారావు పాటిల్

భైంసా రూరల్ జనం సాక్షి ఆగస్టు14

నిర్మల్ జిల్లా ముదొల్ నియోజక వర్గం లోని కుంటాల మండలంలోని లింబా (కే) గ్రామంలో ప్రతి ఇంట జాతీయ జెండా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రామారావు పటేల్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్కరి లో దేశభక్తి పెంపొందించే కార్యక్రమంలో భాగంగా 75వ స్వాతంత్ర దినోత్సవాల్లో భాగంగా ఆజాదిక అమృత్ మహోత్సవంలో భారతదేశ ఔన్నత్యాన్ని చాటే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు ప్రతి గ్రామంలో ఇంటింటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు .ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఒక్కరు ఎగరవేయాలని మరియు వారి వారి మొబైల్ ఫోన్లో వాట్సాప్ డీపీలుగా భారత జాతీయ పతాకాన్ని పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా గతం లో స్వాతంత్ర భారతావని సాధించిన విజయాలు మనతోపాటు యావత్ ప్రపంచ దేశాలకు దిక్సూచిగా పనిచేస్తున్నాయని పేర్కొనడం జరిగింది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం ఎందరో మంది త్యాగదనుల ప్రాణ పోరాట ఫలితంగా సాధించుకున్నామని వారందరినీ మనం సదా స్మరిస్తూ ఉండాలని పిలుపునివ్వడం జరిగింది. 76 ఏళ్లలో స్వాతంత్ర సంగ్రామం, ఆలోచనలు, విజయాలు, చర్యలు, పరిష్కారాలు, ఈ ఐదు స్తంభాలు మన దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయని పేర్కొన్నారు అనంతరం స్థానిక పాఠశాలలో విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది అంతేకాకుండా వీటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు తదానంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వీరితోపాటు కుంటాల మండలం ఎంపీపీ ఆప్కా గజ్జారం, పెంచికల్ పాడ్ సర్పంచ్ దిగంబరపటేల్, మీర్జాపూర్ ఎంపీటీసీ రజాక్, అంబకంటి ఎంపీటీసీ సుధాకర్ ఓల మాజీ సర్పంచ్ గజ్జరం వార్డు మెంబర్ సాయన్న, అడ్వకేట్ నరేష్ ,రాజన్న ,మల్లా రెడ్డి ,సాయికుమార్ ,శ్రీను ,సిందె దత్తు ,రాజు ,యాదవరావు పటేల్ ,చక్రధర్ పటేల్ గుంటూరు శంకర్ తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు