ప్రతి ఒక్కరు ప్రశ్నించే స్థాయికి ఎదుగాలన్నదే మా ఆలోచన – మా ప్రభుత్వం లేదంటే మళ్లా పోటీ చేయడం ఎందుకు..? – ఈ ప్రాంత అభివృధ్దిపై శ్వేత పత్రం విడుదల చేయాలే – మీడియా సమావేశంలో జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌


జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో అనేక ఏండ్లు పరిపాలన చేసి ప్రజలను పట్టించుకోని పాలకులను ప్రశ్నించే స్థాయికి ప్రతి ఒక్కరు ఎదుగాలన్నదే మా ఆలోచన అని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. సోమవారం మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత స్థాయి పదవులు అనుభవించి ఈ ప్రాంత అభివృధ్ది చేయకండా ప్రజల గురించి ఆలోచించకుండా నయా పైసా సాయం చేయాలని వాళ్లను మంచివాళ్లను, సార్లని చెప్పడని కాంగ్రెస్‌ నాయకులు ఇంకా మా దేవుళ్లని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అయితే నాగేపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ బిడ్డలు గొప్పగా ఆలోచన చేసి ప్రజల ముందు ఉంచారని అన్నారు. నియోజకవర్గానికి చెందిన ఒక్క కుటుంబం 40 ఏండ్లు ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచి చెంచడు నీళ్లు పోయకుండా గొప్పవాళ్లమని చెలామణి అవుతున్నారని అన్నారు. రెండు రోజుల క్రితం మానేరు వరదలు రాగా మంథని మండలం నాగేపల్లికి ఎమ్మెల్యే వరదలను పరిశీలించేందుకు వెళ్లగా ఆ గ్రామానికి చెందిన రైతులు కాపిరపు శ్రీనివాస్‌, తోటపల్లి రాజయ్యలు ఎమ్మెల్యే మీ వల్ల మాకు ఏం సాయం అందడంలేదు… ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదు.. ఈనాడు ఎమ్మెల్యేగా కూడా ఏమి చేయట్లేదని అడిగారని, దీంతో ఎమ్మెల్యే మా ప్రభుత్వం లేదు నేను ఒక్కడినే ఎమ్మెల్యేగా ఉన్న అంటూ సమాధానం ఇచ్చాడని, దీంతో రైతులు సర్‌ మీమ్మల్ని ఒక్కరినే ఎమ్మెల్యేగా మేం గెలిపించుకుంటామే కానీ రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోలేము కదా ఆ 119మంది ఎమ్మెల్యేలకు ఓటు వేసే హక్కు మాకు రాజ్యాంగంలో ఇవ్వలేదు గదా ఏ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే, ఎంపీలకు మాత్రమే ఓటు వేసే హక్కు ఉంది కాదా ఇది కూడా మీకు తెలియకపోతే ఎట్లా అని ప్రశ్నించారని ఆయన గుర్తు చేశారు. ఈనాడు తమ ప్రభుత్వం లేదని చెబుతున్న ఎమ్మెల్యే రేపు మల్లా మీ ప్రభుత్వం రాకపోతే నిలబడటం ఎందుకు అని, రేపు ఏ ప్రభుత్వం వస్తుందో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఎవరికి తెలుసునని, ఈ క్రమంలో మా ప్రభుత్వం లేదని చెప్పే ఎమ్మెల్యే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశావని రైతులు అడిగితే ఎమ్మెల్యే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మంథని ఎమ్మెల్యేను ప్రశ్నించితీరు ప్రతి ఒక్కరిలో ఆలోచన రావాల్సిన అంశమని, అలాంటి ఆలోచన రైతుల్లో రావడం గొప్ప విషయమన్నారు. ఎస్సీ ఎస్టీ బిడ్డలో ఇలాంటి ఆలోచన రావడం సంతోషకరని, ఇలాంటి ప్రతి ఒక్కరిలో ఆలోచనలు రావాలన్నదే మా ఆకాంక్ష, ఆరాటమన్నారు. రైతులు అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని, ఏది ప్రశ్నించినా జేఎన్‌టీయూ కళాశాల తీసుకువచ్చామని చెప్పడం తప్ప ఈ ప్రాంతంలో చేసిందేమీ లేదన్నారు. తాను ఈ ప్రాంత అభివృధ్దిపై అడిగితే తనను లెక్క చేయరని, ఒక జెడ్పీ చైర్మన్‌గా, నాయకుడిగా గుర్తించరని ఆయన అన్నారు. అ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలంటే రాష్ట్రంలోని 119మంది ఎమ్మెల్యేలను ఇక్కడి ప్రజలు గెలిపించుకోవాలా ఇదేనా ఎమ్మెల్యే చెప్పే సమాధానమా అని ఆయన ఎద్దేవా చేశారు. 119 ఎమ్మెల్యేల గెలుపులో మంథని నియోజకవర్గ ప్రజలకు ఏమైనా సంబంధం ఉంటుందా అని ఆలోచన చేయని దుస్థితి ఇక్కడి ఎమ్మెల్యేదన్నారు. నాగేపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ బిడ్డల్లో ఎలాంటి ఆలోచన, చైతన్యం వచ్చిందో అలాంటి ఆలోచనలు ఈ ప్రాంతంలో బీసీలు, రెడ్డి సామాజికవర్గాలు, అగ్రవర్ణాల్లోని పేదల్లో ఆలోచనలు, చైతన్యం రావాలని ఆయన అన్నారు. ఈ ప్రాంత ప్రజలు, ఓటర్లు అడిగినట్లుగా ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని, అభివృధ్దిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన ఈ సందర్బంగా డిమాండ్‌ చేశారు.

తాజావార్తలు