ప్ర‌తి వీఆర్ఏ కుటుంబం సీఎం కేసీఆర్‌కు రుణ‌ప‌డి ఉంటుంది

జనం సాక్షి కొల్లాపూర్ జులై 25
కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తెలంగాణ మాదిగ దండోరా జిల్లా అధ్యక్షులు డీకే మాదిగ మాట్లాడుతూ వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంపై వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని.వీరి త్యాగపూరిత సేవ చాలా గొప్పదని భావించింది రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రభుత్వ ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారిని ప్రభుత్వంలో వివిధ శాఖలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చాలా సంతోషకర విషయం అని రాష్ట్ర వ్యాప్తంగా 20,555 మంది వీఆర్‌ఏలు పనిచేస్తున్నారు. వీరిలో నిరక్షరాస్యులు, ఏడో తరగతి నుండి డిగ్రీ వరకూ చదివినవారు ఉన్నారు. వీరి విద్యార్హతలను బట్టి వారి ప్రభుత్వ ఉద్యోగ కేటగిరీలను నిర్ణయిస్తారు. 61 ఏళ్లు దాటిన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఇంకా చనిపోయిన వీఆర్‌ఏ వారసులు, విద్యార్హతల వివరాలను కూడా సేకరిస్తామని అదేవిధంగా వీఆర్‌ఏలలో డిగ్రీ అర్హత గల వారిని జూనియర్ అసిస్టెంట్లుగానూ, పురపాలక వార్డు అధికారులుగానూ నియమిస్తారు. ఇంటర్ అర్హత గలవారిని రికార్డు అసిస్టెంట్లుగానూ, పదవ తరగతి వారిని సబార్డినేట్లుగానూ, హెల్పర్లుగానూ నియమిస్తారు. అని చెప్పడం చాలా ఆనందకరమైన విషయం అని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నా ఏకైక ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అని డీకే మాదిగ తెలిపారు

తాజావార్తలు