ప్రధాని చేతుల మీదుగా పూర్ణాహుతి , అమరావతి శంకుస్థాపన..!

hafvoy43
9 నుంచే పూజలు, ¬మాలు

రత్నన్యాసం, శిలాన్యాస కార్యక్రమాలు
భూమిలో యంత్రస్థాపన
గుంటూరు: వేద మంత్రోచ్ఛారణలతో ఆ ప్రాంగణం మారుమోగింది. ¬మాలు… పూజలతో ఆ ప్రాంతం పులకాంకితమైంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం శాస్త్రవిధులను అనుసరించి ఘనంగా జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే సమయానికి అన్ని పూజలు నిర్వహించి పూర్ణాహుతికి సిద్ధం చేశారు. ప్రధాని వచ్చాకఆయన చేతుల మీదుగా పూర్ణాహుతి చేయించి, శంకుస్థాపన కార్యక్రమాలునిర్వహించారు. ప్రధానితోపాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాల్లోపాల్గొన్నారు. ప్రధాని వచ్చాక మొత్తం కార్యక్రమం 10 నిమిషాల వ్యవధిలో పూర్తయింది. ప్రధాన వేదిక పక్కనే 36 అడుగుల పొడవు, 36 అడుగుల వెడల్పుతో ప్రత్యేకంగా నిర్మించిన ¬మశాలలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచే పూజలు మొదలయ్యాయి. గుంటూరు జిల్లాలోని రేపల్లె మండలం నల్లూరు గ్రామానికి చెందిన ఐదుగురు వేద పండితులు శంకుస్థాపన పూజలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వాస్తు సిద్ధాంతి రాఘవయ్య, తుళ్లూరు తహసీల్దారు అన్నే సుధీర్‌బాబు పర్యవేక్షణలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
విష్వక్సేన పూజతో మొదలు..!
గురువారం ఉదయం 9 గంటలకే ¬మశాలలో విష్వక్సేన పూజతో కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం వాస్తుపూజ, నవగ్రహ మండపారాధన చేశారు. ఆ తర్వాత లక్ష్మీగణపతి ¬మం, సుదర్శన ¬మం నిర్వహించారు. ప్రధాని వచ్చే సమయానికి పూర్ణాహుతికి కోసం అంతా సిద్ధంగా ఉంచారు. మధ్యాహ్నం12.30 గంటల సమయానికి ప్రధాని ¬మశాలకు చేరుకున్నారు. ఆయనకువేదపండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. 12.35 గంటలకుపూర్ణాహుతి నిర్వహించారు. నేతిలో తడిపిన వస్త్రంలో యాగద్రవ్యాలు మూటకట్టారు. వేద మంత్రోచ్ఛారణల ప్రధాని వాటిని ¬మగుండంలో అగ్నిదేవుడికి సమర్పించారు. అనంతరం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. శంకుస్థాపన కోసం ఎంపిక చేసిన ప్రాంతంలో నేలను కొంత లోతుగా తవ్వి సిద్ధం చేశారు. దానిలో మొదట రత్నన్యాసం చేశారు. ప్రధాని, ముఖ్యమంత్రి నవరత్నాలను ఒక పేటికలో వేశారు. ఏ గ్రహానికి ఏ రత్నం వేయాలో… ఎన్ని వేయాలో… శాస్‌ాన్ని అనుసరించి అన్ని రత్నాలను పేటికలో ఉంచారు. బంగారం, వెండి, రాగి కూడా వేశారు. ఆపేటికను భూమిలో ఉంచారు. అనంతరం బంగారం, వెండి, రాగి నాణేలు వేశారు. ఆ తర్వాత శిలాన్యాసం కార్యక్రమం జరిగింది. అనంతరం యంత్రస్థాపన చేశారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబులకు పండితులు వేదాశీర్వాదం చేశారు. దాంతో శంకుస్థాపన క్రతువుపూర్తయింది. అనంతరం ప్రధాని అమరావతి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
అప్పటి పండితులే..!
జూన్‌ 6న రాజధాని భూమిపూజ నిర్వహించిన నల్లూరుకి చెందిన పండితులే అమరావతి శంకుస్థాపన పూజలు, ¬మాలు నిర్వహించారు. ఎన్‌.వికనస భట్టాచార్యులు ఆధ్వర్యంలో దాశరధి శ్రీనివాస దీక్షితులు, జనార్థన దీక్షితులు తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 500-600 దేవాలయాలకు భూమి పూజలు, విగ్రహ ప్రతిష్ఠాపనలు చేయించిన అనుభవం వీరికి ఉంది. అందుకే రాజధాని భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాలకు వీరిని ప్రత్యేకంగా ఎంపిక చేశారు. రాజధాని భూమిపూజకు, శంకుస్థాపనకు స్థలం ఎంపిక మొదలుకొని, సభాస్థలి ఎంపిక, ఏ దిశలో నిర్మించాలి వంటి అంశాలన్నీ వాస్తు సిద్ధాంతి రాఘవయ్య సలహా మేరకు జరిగాయి. శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఆయన దగ్గరుండి నిర్వహించారు.
పోలీసు రక్షణలో శంకుస్థాపన ప్రాంతం..!
శంకుస్థాపన నిర్వహించిన ప్రాంతంలో గురువారం సాయంత్రం సభ ముగిసిన తర్వాత… తహసీల్దారు సుధీర్‌బాబు ఆధ్వర్యంలో కంకర, ఇసుక, సిమెంటు వేసి పటిష్ఠం చేశారు. అక్కడ పోలీసు రక్షణ ఏర్పాటు చేశారు. ఇకపై ఆ ప్రాంతంలో నిరంతరం పోలీసురక్షణ కొనసాగనుంది.

తాజావార్తలు