ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం
జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైనాల రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను శనివారం కమాన్పూర్ మండల సహకార సంఘం ఆఫీసు నుండి కమాన్పూర్ మండల కేంద్రం బస్టాండ్ వరకు శవ యాత్ర చేసి అంబేద్కర్ బొమ్మ వద్ద నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ.. అదాని, ప్రధాని నరేంద్ర మోడీల చీకటి ఒప్పందాన్ని బయటకు తెచ్చి పార్లమెంటులో కార్పొరేట్ వ్యవస్థకు దేశాన్ని తాక టు పెట్టద్దు అని, దేశ సమైక్యతను విచ్ఛిన్నం చేయద్దని , కుల మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని విచ్చిన్నం చేసే శక్తులపై రాహుల్ గాంధీ గళం ఎత్తి వినిపించడం తో పార్లమెంటులో గొంతు విప్పద్దని కక్షపూరితంగా కార్పొరేట్ ప్రభుత్వమైనటువంటి బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ కనసన్నాల్లో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వైనాల రాజు ఆరోపించారు. ఎట్టి పరిస్థితిలో రాహుల్ గాంధీ ని ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధానమంత్రి పదవిని అడ్డుకోవాలని ఉద్దేశంతో ఆరు సంవత్సరాలు ఎటువంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా వారి పై ఏకగ్రీవ తీర్మానం చేసి పార్లమెంటులో బిల్లు పెట్టించడం జరిగిందని, ఇది దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైనాల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్ ,జిల్లా కార్యదర్శులు సయ్యద్ అన్వర్, బొంపల్లి రాజయ్య, కమాన్పూర్ మండలం సర్పంచులు కటకం రవీందర్, తొగరి అన్నపూర్ణ అశోక్ , ఆకుల ఓదెలు, మాజీ కోఆప్షన్ రఫిక్, గ్రామ శాఖ అధ్యక్షులు కొంత శ్రీనివాస్ , ఎంపీటీసీ శివ శంకరయ్య , ఎస్సీ సెల్ అధ్యక్షులు మల్యాల తిరుపతి మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అప్సర్ మైనార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సయ్యద్ ఇక్బాల్, గ్రామ శాఖ అధ్యక్షులు ఇరుగురాల శేఖర్, కోల నరేందర్, గడ్డం శీను, పిడుగు శంకర్, యాదగిరి రాజయ్య, మాజీ సర్పంచులు కుందారపు బాపు, సాగి శ్రీధర్ రావు, అడ్వాల చంద్రయ్య , పిడుగు నరసయ్య, నాయకులు కుక్క రవి, ఎండి ముస్తాక్ , భద్రపు శంకర్ , చొప్పరి తిరుపతి, గుండేటి శ్రీ మూర్తి , లల్లు,మామిడి రాజు తదితరులు పాల్గొన్నారు.