ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు ప్రోత్సహించాలి
చిత్తూరు,మే12(జనం సాక్షి): చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి విజయగౌరీ అన్నారు. ఈ మేరకు గర్భిణులను ప్రోత్హహించాలన్నారు. గర్భిణులకు అవసరమైన వైద్య సేవలు, వైద్య సలహాలను అందించాలని, ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలోనే చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలని చెప్పారు. గ్రావిూణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించి అందరిలోనూ చైతన్యం తీసుకురావాలన్నారు. హై-రిస్కు గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్కానింగ్ కేంద్రాలపై నిఘా ఉంచాలని సూచించారు. వేసవి సందర్భంగా ఓఆర్‌ఎస్ పొట్లాలు, సిలైన్‌లను ఆసుపత్రిలో అందుబాటులో ఉంచాలని చెప్పారు.మాతా, శిశు మరణాల నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు. నిత్యం సమావేశాల ద్వారా అధికారులకు కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.