ప్రభుత్వ పాఠశాలకు విద్యుత్ బకాయిలు చెల్లించిన నందికంటి శ్రీధర్.
మల్కాజిగిరి.జనంసాక్షి.జులై 19
కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ బకాయిలు పేరుకుపోయిన కారణంగా యాప్రాల్ లోని మండల ప్రజా పరిషత్ పాఠశాలకు విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో సంబంధిత అధికారులు విద్యుత్ నిలిపివేశారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.విషయం తెలుసుకున్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నంది కంటి శ్రీధర్ పాఠశాలకు వెళ్లి విద్యుత్ అధికారులతో చర్చించి కొంతమంది మిత్రుల సహకారంతో పెండింగ్ లో ఉన్న విద్యుత్ బకాయిలను 75000 చెల్లించారు.వెంటనే సంబంధిత అధికారులు పాఠశాలకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు.దీంతో విద్యార్థులు,పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ నంది కంటి శ్రీధర్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈసందర్భంగా నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ.
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల దుస్థితి ఎలా ఉందో ముఖ్యమంత్రి కెసిఆర్ మన వడిని అడిగితే చెప్తాడని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో చాకో,ఎస్వీఎస్ ప్రసాద్, మధుసూదన్ రెడ్డి,వేణు,రమేష్,పాండు, సంతోష్,శివనాయుడు,యశ్వంత్ యాదవ్,అమల్ కుమార్ రెడ్డి,ధనరాజ్, రాజలింగం,చంద్రశేఖర్,బాలరాజు,ప్రవీణ్ కుమార్,మండల సతీష్,రాజు తదితరులు పాల్గొన్నారు.