ప్రభుత్వ విద్యావిధానంతో నష్టం

కాకినాడ ,మే15(జ‌నం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యావ్యతిరేక విధానాలవల్ల అనేక మంది బాలలు బడికి దూరమవుతున్నారని టీచర్‌ యూనియన్‌ నేతలు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ప్రైవేటు పాఠశాలలు విపరీతంగా పెరిగిపోతూ ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హేతుబద్ధీకరణ పేరుతో ప్రభుత్వ పాఠశాలల మూసివేత చర్యలను విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యాపరిరక్షణ కమిటీ  డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన విద్యాప్రమాణాలు అందాలంటే ఉపాధ్యాయ, విద్యార్థులు సరైన నిష్పత్తిలో ఉండాలన్నారు.  విద్యారంగాన్ని సేవారంగంగా ప్రభుత్వం అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు అనుసరిస్తున్న విధానాలను తిప్పికొట్టడం కోసం ఐక్యంగా ఉద్యమిస్తామని చెప్పారు.

తాజావార్తలు