ప్రశాంతంగా విద్య సంస్థల బంద్
రామారెడ్డి జూలై 12 ( జనం సాక్షి. ) :ప్రశాంతంగా విద్య సంస్థల బంద్ చేసినట్లు వామపక్ష విద్యార్థి సంఘాల సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య జిల్లా కన్వీనర్ పి. శివ ప్రసాద్ మాట్లాడుతూ , రామారెడ్డి మండల కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ ఎఫ్ ఆద్వర్యంలో వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యం లో రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపుమేరకు పాఠశాలలు, కళాశాలలో బంద్ నిర్వహించడం జరిగిందన్నారు.రామారెడ్డి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ , స్లీపర్స్ , వాచ్మెన్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు వెంటనే అందజేయాల న్నారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. అదేవిధంగా కార్పొరేట్ , ప్రైవేటు విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఫీజులు వసూళ్లు చేస్తు నియంత్రణ లేకుండా వసూల్ చేస్తున్న నేపథ్యంలో పాఠశాలలపై కళాశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు