ప్రాజెక్ట్‌లకు నీరస్తేనే విద్యుత్‌లోటు అధిగమించవచ్చు

హైదరాబాద్‌: చిన్న పరిశ్రమల యజమానులు సీసీబీసీఎల్‌ సీఎండీ అనంతరాముని కలిసారు. పరిశ్రమలను శావ్వతంగా మూసివేస్తామని అప్పుల్లో కూరుకుపోయామని మొర పెట్టుకున్నారు. అనంతరాము  అందుకు సమాదానంగా విద్యుత్‌లోటును అధిగమించాలంటే ప్రాజెక్ట్‌లకు నీరు రావల్సిందేనని అన్నారు. గ్యాస్‌ అధారిత విద్యుత్‌ ఉత్పత్తి 1200నుంచి 500 మెగవాట్లకు పడిపోయిందని వేసవిలో విద్యుత్‌ ప్లాంట్‌లను నిరంతరాయంగా పనిచేయించటం వల్ల ప్రస్తుత సాంకేతిక లోపాలు ఏర్పాడుతున్నాయని తెలిపారు. తమ పరిధిలో ఉన్నంతమేరకు వారికి సహాయం చేస్తామని హామి ఇచ్చారు.

తాజావార్తలు