ఫసల్వాది గ్రామంలో హెల్త్ సెంటర్ బిల్డింగు భూమి పూజ

సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి , ఆగస్టు 10  :: సంగారెడ్డి మండల పరిధిలోని ఫసల్వాది గ్రామంలో గ్రామ హెల్త్ సెంటర్ బిల్డింగు కు గ్రామ సర్పంచ్ నిర్మలాదేవి ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యంతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నం మాణిక్యం మాట్లాడుతూ అసలు వాది  గ్రామంలో గ్రామంలో త్వరలో గ్రామ హెల్ప్ సెంటర్ బిల్డింగ్ పూర్తి చేసుకోవడం జరుగుతుందని దానితో ప్రజల ఆరోగ్య సమస్యలు తీరుతాయన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నందున అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలతో అందరూ సుభిక్షంగా ఉంటున్నారు అన్నారు. ఎవరికి ఇబ్బందులు కలిగిన తమ దృష్టికి తీసుకురావాలని వాటిని పట్నం మాణిక్యం ఫౌండేషన్ ద్వారా పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అర్చన, గ్రామ కార్యదర్శి రామలింగం, ఎం పి ఎం వెంకటేష్, ఏఎంసీ డైరెక్టర్ చింతల సాయన్న, మాజీ సర్పంచ్ సాయమ్మ, మత్స్యశాఖ అధ్యక్షులు వెంకటేష్, వార్డు మెంబర్లు, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు