ఫాసిస్ట్ ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ పరివారానికి వ్యతిరేకంగా వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమం చేపట్టాలని సీపీఐ (ఎంఎల్) ఆర్‌ఐ నిర్ణయించింది.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎం-ఎల్) రివల్యూషనరీ ఇనీషియేటివ్ సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ 2023 ఆగస్టు 9-10 తేదీలలో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో దేశంలోని వివిధ తీవ్రమైన పరిణామాలపై విస్తృతంగా చర్చించి, ఫాసిస్ట్ ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి దాని మతతత్వ విభజనను తీవ్రంగా పెంచుతున్నాయని దృఢమైన నిర్ధారణకు వచ్చింది. దేశం లోని అధికిర పాలక బడా దోపిడీ వర్గం ప్రజలలో భ్రమలు సృష్టించి తద్వారా 2024లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించే విధంగా మత విభజన విధానాలు మరియు కార్యక్రమాలు తీవ్రం చేస్తుందనే నిర్ణయంకు వచ్చింది. వారు ఇప్పటికే మణిపూర్‌లోని మెయిథి మరియు కుకీ తెగల మధ్య శతాబ్ద కాలంగా ఉన్న ఎథనిక్ ఐక్యతను నాశనం చేశారు; హర్యానాలో ముస్లింలపై దాడులను విస్తృతం చేశారు. మత విభజనను వ్యాప్తి చేయడానికి వారు ఇప్పుడు గ్యామ్ బాపిని మసీదు ను లక్ష్యంగా చేసుకున్నారు
అంతర్జాతీయ మరియు జాతీయ కార్పొరేట్‌లను సంతృప్తి పరచడానికి, మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టం 2006ను పలుచన చేస్తూ అటవీ సంరక్షణ (సవరణ) చట్టం 2023 చెసింది. RSS-BJP మరియు కార్పొరేట్ల అనుబంధానికి ఇది తాజా ఉదాహరణ.
నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి; నిరుద్యోగం చాలా వేగంతో పెరుగుతోంది; ఆహారం, విద్య, ఆరోగ్య సమస్యలకు సంబంధించిన అన్ని సమస్యలు ఇప్పుడు తీవ్రమైన దశలో ఉన్నాయి. కానీ మోడీ కేంద్ర ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది. ప్రజల దృష్టిని వారి బాధల నుండి మళ్లించడానికి, ఫాసిస్ట్ RSS-BJP మత విద్వేష విభజించి పాలించు విధానాన్ని అవలంబిస్తున్నాయి. అటువంటి హేయమైన డిజైన్‌కు ఉదాహరణగా యూనిఫాం సివిల్ కోడ్ ఇటీవల ఉదాహరణ. ఈ నేపథ్యంలో 26 ప్రతిపక్ష రాజకీయ పార్టీల కూటమి I.N.D.I.A ఏర్పాటును CPI(ML)RI స్వాగతించింది.
కేంద్ర ఆర్గనైజింగ్ కమిటీ సమావేశంలో తీసుకున్ననిర్ణయాలు :
1. BJP-ఆర్ యస్ యస్ పరివారం పాలన మరియు ఆశక్తుల దుష్ట మత ద్వేషాన్ని బట్టబయలు చేస్తూ 2023 ఆగస్టు చివరి వారంలో భారతదేశం అంతటా ఒక వారం పాటు నిరసన ఉద్యమం నిర్వహించబడుతుంది.
2.ఫాసిస్ట్ RSS-BJP ఓటమి కోసం శ్రామికవర్గం, రైతులు, మహిళలు, యువకులు-విద్యార్థి, దళితులు, గిరిజనులు, ముస్లింలు మరియు భారతీయ సమాజంలోని ఇతర అన్ని అణగారిన ఇతర వర్గాలు, కమ్యూనిస్టు విప్లవ, వామపక్ష-ప్రజాస్వామ్య, ప్రగతిశీల-లౌకిక శక్తులను దేశవ్యాప్త ఉద్యమం కోసం సమీకరించాలి.
ప్రదీప్ సింఘా ఠాకూర్- ప్ర. కార్యదర్శి సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ సిపిఐ(ఎంఎల్)ఆర్‌ఐ, మొబైల్: 9477573940.
గడ్డం సదానందం -తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మరియు సి.ఓ.సి సభ్యులు -9398188064.