ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా తీవ్రమవుతున్న ఆందోళన
ఏలూరు,అక్టోబర్17(జనంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు ఆక్వా ఫుడ్ పార్కును వ్యతిరేకిస్తూ ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. నివురుగప్పిన నిప్పులా ఇప్పుడు అక్కడ సమస్య ఉంది. ఎప్పుడు ఎలాంటి వ్యతిరేక ఆందోళన అయినా రాజుకునే పరిస్తితులు ఉన్నారు. ఇటీవల సిపిఎంతో పాటు వైకాపా తదితర పార్టీలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. దీనికితోడు స్థానిక ప్రజలు కూడా దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో తమకు భూగర్భ జలాలు విషతుల్యం అవుతాయని అంటున్నారు. ఆక్వా ఫుడ్‌పార్క్‌ను తక్షణం జనావాసాలు లేని చోటికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.వేలాది మంది ఆధారపడి జీవిస్తున్న గొంతేరు డ్రెయిన్ నీటిని ఆక్వా పార్క్‌కు తరలిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పేదలు, రైతులపై దాడులు చేస్తున్నారని, ఇక వారి ఆటలు సాగనివ్వమని స్పష్టం చేశారు. తుందుర్రులో వర్గాలకు అతీతంగా అందరూ కలిసి పోరాటం చేయడం అభినందనీయమని అన్నారు. వీరికి మద్దతుగా ఉంటామని అన్నారు. పరిశ్రమపై చంద్రబాబు, సమాధానం చెప్పేలా చేస్తామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దోపిడీలు చేయడం తప్ప అభివృద్ధి పట్టదని విమర్శించారు. ఆక్వా పార్కుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి పూర్తిగా అండగా నిలుస్తామని ప్రకటించారు. 144 సెక్షన్ విధించి పార్క్ నిర్మించాలనుకోవడం దారుణమని పేర్కొన్నారు. ఇటువంటి పరిశ్రమలు పచ్చటి పల్లెల్లో కాకుండా తీర ప్రాంతంలో ఏర్పాటు చేయాలని అన్నారు.