బలహీనపడిన తీవ్రవాయుగుండం
విశాఖపట్నం, సెప్టెంబర్ 19 : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఏపీలోని ఉత్తరకోస్తా జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వివరించింది. కోస్తా జిల్లాలో క్యుమిలోనింబస్ మేఘాల వల్ల అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖ జిల్లా రైవాడ నుంచి వస్తున్న వరద ఉధృతితో గౌరవరం వద్ద కాజ్‌వే కొట్టుకుపోయి 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏలూరులో ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది.