బాబు ఢిల్లీలో దీక్ష చేపట్టాలి

చిత్తశుద్ది ఉంటే మోడీని అక్కడే నిలదీయాలి
విజయవాడ,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): కేంద్రంపై అదేపనిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎపి సిఎం చంద్రబాబు నాయుడుకు దమ్మూ, ధైర్యముంటే ఢిల్లీ కేంద్రంగా దీక్ష చేయాలని ప్రత్యేక ¬దా సాధన సమితి  నేతలు అన్నారు.జపాన్‌, సింగపూర్‌ తరహాగా ఉద్యమం చేయాలని చంద్రబాబు ప్రజలకు సూచిస్తున్నారని, అసలు జపాన్‌లో ఉద్యమాలెలా వుంటాయో రాష్ట్ర ప్రజలకెలా తెలుస్తాయని ప్రశ్నించారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు రాష్టాన్రికి కి చేసిన పాపం ఊరికినే పోదని అన్నారు. సిఎం చేసిన పాపాలను కడిగేసుకు నేందుకే విజయవాడ పిడబ్ల్యుడి గ్రౌండులో ఈ నెల 20న దీక్షకు దిగుతున్నారని చెప్పారు. ఆయనకు చిత్తశుద్ధి వుంటే ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్దగానీ, ప్రధాని మోడీ ఇంటి ఎదుట గానీ దీక్షకు దిగాలని
సూచించారు. ¬దా ఉద్యమకారులపై ప్రభుత్వం కేసులు నమోదు చేసి భయబ్రాంతులకు గురిచేస్తోందని
అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒకరంగానూ, లేనప్పుడు మరోరకంగానూ వ్యవహరిస్తున్నారని, ఆయనకు ప్రజలే బుద్ధిచెబుతారని తెలిపారు. ఈ నెల 20వ తేదీన ¬దాపై విజయవాడలో విస్తృతస్థాయి చర్చాగోష్టిని నిర్వహిస్తున్నామని, దీనికి అన్నిపక్షాల నేతలూ హాజరవుతున్నారని పేర్కొన్నారు. సిఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి వుంటే ప్రతిపక్ష నేతలతో కలసి ఢిల్లీలో ఆందోళన చేయాలని సూచించారు.వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి ¬దాలో వున్నప్పటికీ  దీక్షకు దిగాలని హితవు పలికారు. మోడీ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు.  ప్రత్యేక ¬దా సాధన సమితి ఆధ్వర్యాన 24న బ్లాక్‌డేగా ప్రకటించింది. ఆ రోజు సాయంత్రం ఏడుగంటల నుండి అరగంటపాటు దీపాలు ఆర్పేసి బిజిలీ బంద్‌ నిర్వహించాలని రాష్ట్ర ప్రజలను కోరింది. బంద్‌ను విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. ప్రత్యేక ¬దా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌ తదితరులు ప్రజలను అభినందించారు. బంద్‌ విజయవంతం తో దేశ వ్యాప్తంగా కేంద్రానికి ఒక సంకేతం పంపామన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ దిగి రావాలని,  ప్రత్యేక ¬దా, విభజన హావిూల అంశాలపై స్పందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం బంద్‌ను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజావార్తలు