బాబు పాలన ఏడ్చినట్టు ఉంది – జగన్

img_910864ప్రత్యేక హోదా సాధన కోసం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహిస్తున్న ‘జై ఆంధ్రప్రదేశ్‌’  బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తూ.. ఈ రెండున్నరేళ్లలో చంద్రబాబు పరిపాలన ఏడ్చినట్టు ఉందని అన్నారు . తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని చెప్పిన భాజపా తర్వాత మాట మార్చిందన్నారు , ప్రత్యేక హోదా ఇస్తామని విశాఖ వేదికగానే భాజపా హామీ ఇచ్చిందని.. అందుకే ఇదే వేదికపై నుంచి వారిని నిలదీసేందుకు విశాఖలో సభ పెట్టినట్లు జగన్‌ చెప్పారు. చంద్రబాబు పాలనలో రైతులు, కార్మికులు, రైతు కూలీలు, డ్వాక్రా సంఘాల సభ్యులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరూ సంతోషంగా లేరు. రైతులు బ్యాంకుల్లోకి వెళ్లి రుణాలు తీసుకునే పరిస్థితి లేదు. విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదు. రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయలేదు. రాష్ట్రంలో ఒక్క వ్యక్తి కూడా సంతోషంగా లేడు. విభజన హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కనీసం ప్రశ్నించలేకపోతోంది. ఎన్నికల హామీల అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.  రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు అప్పుల విషయంలో నంబర్‌వన్‌గా నిలబెట్టారు’ అని జగన్‌ విమర్శించారు.

 

తాజావార్తలు