బాల గేయ సారస్వతం పుస్తకం ఆవిష్కరణ
జనంసాక్షి , కమాన్ పూర్ :
భవాని సాహిత్య వేదిక వారి ఆధ్వర్యంలో వైరాగ్యం ప్రభాకర్ సంపాదకీయం లో వెలువడ్డ ” బాల గేయ సారస్వతం” పుస్తక సంకలనం విశిష్ట అతిథి బాల సాహితీవేత్త డా.కందేపి రాణి ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేడు బాలసాహిత్యం రాసేవారు గాని, చదివేవారు గాని కరువవుతున్న నేటికాలంలో సంపాదకుడు డా.వైరాగ్యం ప్రభాకర్ ప్రత్యేకించి బాలల కోసం 116 మంది రచయితలతో సంకలనం ఆవిష్కరించడం గొప్ప విషయమని తెలిపారు. పుస్తక పఠనం రానురాను తగ్గి పోయిందని కాని పుస్తక పఠనం వల్ల మనిషి జ్ఞానంతో పాటు జ్ఞాపక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. జులై 30 ఆదివారం కరీంనగర్ లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో జరిగింది. పుస్తక సంపాదకులు డా.వైరాగ్యం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో “బాల గేయ సారస్వతం” పుస్తక సంకల నంలో పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామ నివాసి రైతు, ప్రముఖ కవి, రచయిత, సామాజిక కార్యకర్త, డెమోక్రటిక్ జర్ణలిష్ణ్ ఫెడెరేషన్ రాష్ట్ర కార్యదర్శి, కూచన.మల్లయ్య మహర్షి రాసిన “బాలలు” శీర్షికన గేయం అచ్ఛైంది .ముఖ్య విశిష్ట అతిథి చేతుల మీదుగ పుస్తకం యిచ్చి అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలొ బాల సాహిత్య పీఠం అధ్యక్షుడు పెందోట వెంకటేశ్వర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ బూర్ల వెంకటేశ్వర్లు డాక్టర్. వాసరవేణి పరుశురాములు, తెరవే పెద్దపల్లి జిల్లాశాఖ ఉపాధ్యాయులు బాలసాని కొమురయ్య, తెరవే పెద్ద పల్లి జిల్లా శాఖ ప్రచార కార్యదర్శి గుండు రమణయ్య, అరువై మంది కవులు, కవయిత్రులు సాహిత్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు .