బిఆర్ఎస్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం  – రైతుల వ్యతిరేకి రేవంత్ రెడ్డి  – రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి రైతులు తగిన       గుణపాఠం చెబుతారు –  టీఎస్ హెచ్ డి సి  చైర్మన్ చింత ప్రభాకర్

సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి , జూలై 13 :: రైతుల వ్యతిరేకి రేవంత్ రెడ్డి అని, రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి రైతులు తగిన గుణపాఠం చెబుతారనీ టీఎస్ హెచ్ డి సి  చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు.తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నలకు 24 గంటల కరెంట్ అవసరం లేదని కేవలం 3 గంటల కరెంటును మాత్రమే ఇస్తే సరిపోతుందని తెలంగాణ రాష్ట్ర రైతన్నలను అవమానం పరిచే విధంగా మాట్లాడిన కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని అతిధి గృహం ముందు రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారుఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కేసిఆర్ తెలంగాణ ప్రభుత్వం రైతునే రాజు చేయాలని, బిఆర్ఎస్ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పలు సంక్షేమ పథకాలు రైతుబంధు, రైతుభీమా, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్, మిషన్ భగీరథ, కంటి వెలుగు, మత్య్సకార్మికులకు చేపల పంపిణి, యాదవ్ లకు గొర్రెల పంఫీణీ, నాయి బ్రాహ్మణులకు బార్బర్ షాపులకు ఉచిత కరెంటు, ముదిరాజ్ లకు వాహానాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా తెలంగాణ పేద ప్రజల కోసం అనునిత్యం కేసిఆర్ పాటుపడుతూనరాన్ని తెలిపారు. దేశంలో పంజాబ్ రాష్ట్ర రైతుల తర్వాత అత్యధికంగా వరిని పండించే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో రెండవ స్థానంలో ఉంటే అది చూసి ఓర్వలేక పోతున్న జాతీయ పార్టీలు అయినటువంటి భారతీయ జనతా పార్టీ రైతుల మోటార్ల వద్ద మీటర్లు పెట్టాలని చూస్తుంటే నేడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 24 గంటల వద్దు తెలంగాణ రైతులకు మూడు గంటల కరెంట్ చాలని తెలంగాణ రైతన్నల మనోభావాలను దెబ్బతీస్తున్న ఈ రెండు పార్టీలకు రాబోవు ఎన్నికల్లో తెలంగాణ ప్రజానీకం తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. వ్వవసాయంలో తెలంగాణలో రైతులు అద్భుతాలు సృష్టిస్తూ ఇప్పుడిప్పుడే రైతుల నోట్లోకి నాలుగు ముద్దలు వెళుతుంటే అది జీర్ణించుకోలేని కాంగ్రెస్, బిజేపి పార్టీలో నేతలు రైతులు అరిగోసలు చూడాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికయిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కేసిఆరును మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభు గౌడ్, మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి, మాజీ సిడిసి చైర్మన్ విజేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు బీరయ్య యాదవ్, డా. శ్రీహరి, మందుల వరలక్ష్మి, జిల్లా నాయకులు ఆత్మకూర్ నాగేష్, కంది ఎంపిపి సరళ, ఎంపిటిసి నందకిషోర్, సంగారెడ్డి, కొండాపూర్, కంది మండల అధ్యక్షులు చక్రపాణి, విట్ఠల్, మధుసూదన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆర్. వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి నర్సింలు, నక్క నాగరాజ్ గౌడ్, జలందర్ రావు, వాజిద్, పరుశురాం నాయక్, జీవి శ్రీనివాస్, లక్ష్మణ్, శ్రీకాంత్ కౌన్సిలర్లు, సర్పంచులు, జెడ్పిటిసిలు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు భారీగా ఎత్తున బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజావార్తలు