బిజెపికి కొత్త బిచ్చగాడొచ్చాడు

జగన్‌ను మెచ్చుకున్న కన్నాకు బిజెపి అధ్యక్షపదవి
కోర్టుల చుట్టూ తిరిగే వారా విమర్శలు చేసేది
మౌలిక వసతుల కల్పనతో గ్రామాల రూపు రేఖలను మార్చాం
శ్రీకాకుళం పర్యటనలో చంద్రబాబు
శ్రీకాకుళం,మే15(జ‌నం సాక్షి ):  బీజేపీకి కొత్త పూజారి వచ్చాడని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం రంగసాగారం వద్ద  నీరు-ప్రగతి పేరుతో నిర్వహించిన సభలో సీఎం ప్రసంగించారు.  వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రత్యేక ¬దా కోసం పోరాడుతున్నాడని కన్నా సర్టిఫికెట్‌ ఇచ్చారని, వైసీపీకి వెళ్ళటానికి సిద్ధమైన నేతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ్ని చేసిందని విమర్శించారు. శుక్రవారం కోర్టుకు వెళ్లే వారు తనపై విమర్శలు చేయడం బాధాకరమని సీఎం అన్నారు. పెన్షన్ల పంపిణీలో ఒక్క రూపాయి కూడా అవినీతి లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 50 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చి పెద్దకొడుకునయ్యానని అన్నారు. ప్రతిపక్ష నేతలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, ఐదు బ్జడెట్లలో తెలుగు ప్రజలకు కేంద్రం అన్యాయం చేసిందని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధి, సంక్షేమంపై తన కంటే బాగా చేస్తే చర్చకు రావాలని ముఖ్యమంత్రి సవాల్‌ విసిరారు.  మౌలిక వసతుల కల్పనతో గ్రామాల రూపు రేఖలను మార్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏడాదిన్నరలో ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు ఇస్తామని ప్రకటించారు. జిల్లాలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించామని చెప్పారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని, ఏడాదిన్నరలో ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు ఇస్తామని హావిూ ఇచ్చారు. అక్టోబర్‌ 2 నాటికి అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేస్తామన్నారు. 5వేలకు మించి జనాభా ఉన్న గ్రామాల్లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామన్నారు. వంశధార ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేస్తున్నామని చెప్పిన సీఎం.. తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత టీడీపీదేనని అన్నారు. పోలవరం పూర్తి చేసి కరువుని పారద్రోలుతామన్నారు. విద్యుత్‌ చార్జీలు పెంచమని చెప్పిన ఏకైక ప్రభుత్వం తమదేనని సీఎం చాటిచెప్పారు. వ్యవసాయంలో వినూత్న మార్పులు తీసుకువచ్చామని, విత్తనాలను నేరుగా రైతుల ఇంటికే పంపిస్తున్నామని తెలిపారు. ఉపాధి కూలిని 130 నుంచి రూ.197కి పెంచామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతు రుణమాఫీ చేశామన్నారు. పెన్షన్ల పంపిణీలో ఒక్క రూపాయి కూడా అవినీతి లేదని, 50 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చి పెద్దకొడుకు అయ్యానని పేర్కొన్నారు.
సాగునీటి ప్రాజెక్టులతో వ్యవసాయాభివృద్ధి
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సారవకోట మండలం బురుజువాడ గ్రామంలోని రంగసాగరం చెరువు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.  నీరు-ప్రగతిలో భాగంగా చెరువు అభివృద్ధికి రూ. 50 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఒక టీఎంసీ నీరు నిల్వ చేసుకోవచ్చన్నారు. ఆయకట్టు ప్రాంతంలోగల పంటకాల్వలో ఖరీఫ్‌, రబీ సాగుచేసుకోవచ్చని చెప్పారు. అనంతరం చిన్నచిట్టాలపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజా సంక్షేమానికి పింఛన్లు, రేషన్‌కార్డులు, చంద్రన్న పెళ్లికానుక తదితర పథకాలు అమలుచేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి అక్రమాలు జరిగినా 1100 నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. అనంతరం పలువురు గ్రామస్థులు అందించిన వినతి పత్రాలను ఆయన స్వీకరించారు. హిరమండలం నిర్వాసిత గ్రామమైన పాడలిలో సర్వం కోల్పోయామని ప్రభుత్వం ఆదుకోవాలని ఓ మహిళ సీఎంకు వినతిపత్రం అందజేసింది. అర్హులందరికీ నష్టపరిహారం చెల్లించామని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు కలియుగ ఆర్థర్‌ కాటన్‌ అని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు కీర్తించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్‌ నాయుడుతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడూతూ.. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ఢిల్లీ పెద్దలకు వణుకు పుడుతుందన్నారు. ప్రధానిని ఢీ కొట్టే సత్తా చంద్రబాబుకే ఉందన్నారు. సీఎం చంద్రబాబు వేసిన రోడ్లపైనే ప్రతిపక్ష నేత జగన్‌ పాదయాత్ర చేస్తున్నారంటూ.. జగన్‌ రోడ్లపై చేసే పాదయాత్రల కన్నా జైళ్లకు చేసే పాదయాత్రలే ఎక్కువగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. జగన్‌ ఫ్యాన్‌ స్విచ్‌ మోదీ, అమిత్‌ షా చేతుల్లో ఉందన్నారు.
ప్రత్యేక ¬దా సాధనే ధ్యేయం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రత్యేక ¬దా సాధనే లక్ష్యంగా పోరాటం చేస్తున్నామని ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిరసనగా ప్రత్యేక ¬దా కోరుతూ తెదేపా ఆధ్వర్యంలో మంగళవారం ఫిరంగిపురం  మండలంలోని హౌస్‌గణెళిష్‌, గొల్లపాలెం, రేపూడి గ్రామాల్లో సైకిల్‌ యాత్ర జోరుగా సాగింది. మండలం నుంచి పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా కల్పించాలని, విభజన చట్టంలోని హవిూలను అమలు చేయాలన్నారు. ప్రత్యేక ¬దా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మండల తేదేపా అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, నాయకులు పసలతామస్‌, కొత్తపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు