బిజెపికి రైతుల ఆగ్రహం తప్పదు
ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలి: సిపిఎం
ఏలూరు,మే3(జనం సాక్షి): సామాన్య రైతులకు కూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏవిూ చేయడం లేదని అర్థం అయ్యిందని సిపిఎం కార్యదర్శి బలరామ్ అన్నారు. రైతులకు బురిడీ కొట్టించాలని చూడొద్దన్నారు. బిజెపి నేతలు కల్లబొల్లి కబుర్లు మాని కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అవసరమైతే కేంద్రానికి రాష్ట్ర పరిస్థితులు వివరించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో చెప్పాలని, అంతే కానీ మోదీ ప్రభుత్వ పథకాలను వివరించటం వల్ల రైతులకు ఒరిగేవిూ లేదని పలువురు రైతులు ఎంపీ గోకరాజు గంగరాజును నిలదీశారు. పెనుమంట్ర మండలం మార్టేరు వరి పరిశోధన స్థానంలో బుధవారం ఏర్పాటు చేసిన కిసాన్ కల్యాణ్ కార్యశాల కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సమావేశం ప్రారంభం
కాగానే ఎంపీతోపాటు ఆయన పీఏ సునీల్ మాట్లాడారు. రైతులకు జీరో బడ్జెట్ ఏర్పాటు చేసేందుకు ప్రధాని మోదీ పార్లమెంట్‌లో మాట్లాడవలసి ఉండగా.. రాష్ట్ర ఎంపీలు సమావేశాలను అడ్డుకోవటంతో ఆ అవకాశం లేకుండాపోయిందని అనటంతో ఒక్కసారిగా రైతులు మండిపడ్డారు. రైతుల సమావేశాన్ని రాజకీయ వేదికగా మార్చవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందని ఎంపీని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల ద్దుతో బ్యాంకుల చుట్టూ తిరిగితే మూడు వేలు మాత్రమే ఇస్తున్నారని, రెండు, మూడు లక్షలు కావాలంటే ఎన్నో రోజులు రైతులు తిరగాల్సి వస్తోందని వాపోయారు. ఎరువుల ధరలు పెంచారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి.. మరి రైతుల గిట్టుబాటు ధర ఎందుకు పెరగడంలేదని ప్రశ్నించారు. ఎంపీ గంగరాజు స్పందిస్తూ.. విూ వద్ద
సొమ్ముంటే ఖర్చు పెట్టేస్తారు.. బ్యాంకుల్లో నగదు భద్రంగా ఉంటుందని సముదాయించే ప్రయత్నం చేయగా రైతులు ఆగ్రహంతో ఊగిపోయారు. పండిన పంట కోయడానికి కూలీలకు, యంత్రాలకు సొమ్ము ఎక్కడి నుంచి వస్తుందని నిలదీశారు. దీంతో.. రైతుల సమస్యలు చెప్పండి.. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానంటూ ఎంపీ అక్కడి నుంచి నిష్కమ్రించారు. రైతులకు సమాధానం చెప్పలేని వారు ఏం ప్రజాప్రతినిధులని బలరామ్ అన్నారు. అన్ని గ్రామాల్లో ఇదే తీరు ఉందని, రైతుల ఆగ్రహాన్ని బిజెపి చవిచూడక తప్పదని హెచ్చరించారు.
———-