బిజెపితో తెగిన కన్నా బంధం

వైకాపాలో నేడు చేరే అవకాశం
గుంటూరు,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): సుదీర్ఘ కాలం బిజెపిలో కన్నా లక్ష్మీనారాయణ నిరీక్షణ ముగిసింది. మాజీ మంత్రి సీనియర్‌ రాజకీయ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీకీ రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను ఆయన ఆ పార్టీ అధిష్ఠానానికి పంపారు. ఈ నెల 25న ఆయన వైసీపీలో చేరనున్నారు. జగన్‌ ఆ రోజు గన్నవరంలో పాదయాత్ర చేయనున్నారు. గుంటూరు నుంచి కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి కన్నా ఆయన సమక్షంలో వైసీపీలో చేరాలని నిర్ణయించారు. ఈ పరిణామం బీజేపీకి దెబ్బగా భావిస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతగా ఉన్న తనను పార్టీలోకి ఆహ్వానించే సమయంలో.. తన సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని తగిన ప్రాధాన్యం ఇస్తామని మాట ఇచ్చి ఉల్లంఘించారని కన్నా మనస్తాపం చెందారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తన పేరును చివరి వరకు పరిశీలించి.. ఆఖరి క్షణంలో వలస నేతగా పరిగణించి దూరంగా పెట్టడాన్ని ఆయనతో పాటు అనునూయులు జీర్ణించుకోలేకపోయారు. పైగా ఆ పదవిని ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించని సోము వీర్రాజుకు ఇస్తున్నారని తేలడంతో కన్నా కినుక వహించి రాజీనామా చేశారు. అదీగాక రాష్టాన్రికి  ప్రత్యేక ¬దా, విభజన హావిూల అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఒకవేళ బీజేపీలో కొనసాగి.. ఎన్నికల బరిలోకి దిగితే డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదన్న భావనకు వచ్చిన ఆయన బీజేపీని వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రెండ్రోజులపాటు తన అనుయాయులతో మంతనాలు జరిపి వారి మనోగతానికి అనుగుణంగా వైసీపీలో చేరాలని నిశ్చయించారు. ఇప్పటికే తనతో మంతనాలు సాగిస్తున్న వైసీపీ ముఖ్యులతో ఫోన్లో చర్చలు జరిపిన ఈ నెల 25న చేరికకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.
బీజేపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరుతున్న కన్నాకు పెదకూరపాడు సీటుపై జగన్‌ హావిూ ఇచ్చినట్లు తెలిసింది. ఆయన సన్నిహితుడైనఎన్నారై తేళ్ల వెంకటేశ్‌ యాదవ్‌కు ప్రకాశం జిల్లా చీరాల టికెట్‌ ఇస్తామని కూడా హావిూ ఇచ్చినట్లు సమాచారం. తనకు ఆదరణ ఇస్తే వచ్చే ఎన్నికల్లో ఇతర తన అనుచరులను కూడా
వైకాపాలో చేర్పించేందుకు కన్నా ముందుకు సాగనున్నారు.

తాజావార్తలు