బిజెపి అట్టర్‌ఫ్లాప్: జిల్లా అధ్యక్షుడి ఓటమి
కాకినాడ,సెప్టెంబర్1జనంసాక్షి: కాకినాడలో డివిజన్ల వారీగా గెలుపొందిన అభ్యర్థుల్లో బిజెపి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సత్తా చాటాలనుకుంటున్న బిజెపి పదింట పోటీ చేసి టిడిపి మద్దతుతో కేవలం మూడింటిని మాత్రమే గెలుచుకుంది. బిజెపి జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య వైకాపా చేతిలో ఓటమి పాలయ్యారు. కొన్నిచోట్ల టిడిపి రెబల్ అభ్యర్థులుకూడా విజయం సాధించారు. వారు మళ్లీ టిడిపి గూటికి చేరడం ఖాయంగా ఉంది. ఇకపోతే ఈఎన్నికలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య ఓటమి చవిచూడాల్సి వచ్చింది. వైసీపీ అభ్యర్థి చేతిలో ఈయన ఓడిపోయారు. కాగా ఈ 9వ డివిజన్‌లో కంపర రమేష్ (వైసీపీ) విజయం సాధించారు. ఎన్నిక రోజు ఇదే డివిజన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇకపోతే బీజేపీకి కేటాయించిన డివిజన్‌లో టీడీపీ రెబల్ అభ్యర్థి గెలుపొందారు. కాకినాడలోని 39వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి పోటీలో నిలిచారు. అయితే బీజేపీకి టీడీపీ రెబల్ అభ్యర్థి గట్టిపోటీనిచ్చి గెలుపొందారు. మొత్తానికి వైసీపీ 48 డివిజన్లలో అభ్యర్థులను నిలిపిపది సీట్లను కైవసం చేసుకుంది.