బిజెపి ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధనకై చలో మెదక్
అర్హులైన ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలి
బిజెపి సంగారెడ్డి అసెంబ్లీ ఇంచార్జ్ రాజేశ్వరరావు దేశ్పాండే
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి , ఆగస్టు 10 ::
బిజెపి ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధనకై చలో మెదక్ కార్యక్రమంలో భాగంగా
బిజెపి సంగారెడ్డి అసెంబ్లీ ఇంచార్జ్ రాజేశ్వర దేశ్పాండే ఆధ్వర్యంలో సంగారెడ్డి నియోజకవర్గం నుండి దాదాపు 100 వాహనాల ద్వారా వెయ్యి మంది కార్యకర్తలతో బయలుదేరి వెళ్లారు.
ఈ సందర్భంగా రాజేశ్వర దేశ్పాండే మాట్లాడుతూ ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా డబుల్ బెడ్ రూమ్ లంటూ ప్రజలను మభ్యపెడుతూ ఓట్లు దండుకొని గద్దెలనకి కులుకుతున్నారన్నారు. పేద ప్రజలను పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో డబుల్ బెడ్ రూములు ఇస్తామంటూ చెప్పి ప్రజలను మోసం చేసిండు అన్నారు. ప్రజలకు నిజా నిజాలు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందులో భాగంగానే నేడు చేపట్టిన చలో మెదక్ కార్యక్రమం ఉందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు మేము చేపట్టిన నిరసన ద్వారా నైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్ళు తెరవాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి అసెంబ్లీ నాయకులు పోచారం రాములు, వెంకట నరసింహారెడ్డి, మందుల నాగరాజు, కసిని వాసు, పుల్లంగారి సురేందర్, దోమల విజయ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, పాపయ్య, ఎల్లయ్య, ప్రశాంత్, మాణిక్ రావు, శ్రీకాంత్, సూర్య నాయక్, శివ తదితరులు పాల్గొన్నారు.