బి ఆర్ ఎస్ పార్టీ మునిగిపోయే నావ, రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే

తూంకుంట మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ లోకి చేరికల కార్యక్రమంలో టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి:శామీర్ పేట్, జనం సాక్షి :
పోతాయిపల్లి 15 వ వార్డు నూతన కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి అధ్యక్షతన అభినందన సభకు ముఖ్య అతిథిగా టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరయ్యారు.పోతాయిపల్లి లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,సుభాష్ చంద్రబోస్ విగ్రహాలకు పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు.

పోతాయిపల్లిలో 15 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతల బల్వంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించి నూతనంగా ఎన్నికైన 15 వ వార్డు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుని,అనుబంధ సంఘాల అధ్యక్షులను వివిధ పదవుల్లో ఎన్నికైన ప్రతి ఒక్కరికీ శాలువలతో సత్కారించారు.
పోతాయిపల్లి 15 వ వార్డు నుండి భూమ హరినాథ్ వార అనుచరులు 35 మంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్న భూమ హరినాధ్ కి వారి అనుచరులకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
చేరికల అనంతరం హరి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. బి ఆర్ యస్ పార్టీ మునిగిపోయే నావ లాంటిదని, రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని, శ్రీమతి సోనియా గాంధి, మల్లిఖార్జున ఖర్గే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల హామీలతో కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని,మాయమాటలతో కాలం వెళ్ళదీస్తున్న మోడీ,కే సి ఆర్ లను ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శామీర్ పేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ గౌడ్,
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పద్మ,శామీర్ పేట్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బిక్షపతి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మురళి గౌడ్,మున్సిపల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్,
మున్సిపల్ కాంగ్రెస్ కార్యదర్శి మురళి గౌడ్,మున్సిపల్ కాంగ్రెస్ ఎస్సీ సెల్, కిసాన్ సెల్,మైనార్టీ సెల్ అధ్యక్షులు హరిగోపాల్,ధర్మారెడ్డి,జాఫర్, మున్సిపల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాగమణి,మున్సిపల్ కాంగ్రెస్ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి దర్శన్ గౌడ్,మున్సిపల్ కాంగ్రెస్ బిసి సెల్ కార్యదర్శులు హరిగోపాల్,పాండు గౌడ్,శామీర్ పేట్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ రెడ్డి,మున్సిపల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిర్రబోయిన రామచందర్ యాదవ్,మల్లేష్ యాదవ్,దుర్గయ్య,శ్రీనివాస్,భాస్కర్ రెడ్డి,నర్సింగ్ యాదవ్, ఆదినారాయణ,పాండు,బిక్షపతి,సత్యనారాయణ,ప్రసాద్,మున్సిపల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రమేష్,9 వార్డు కాంగ్రెస్ అధ్యక్షులు జగన్,,యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు