బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలోవిరుచుకు పడ్డా :జె.రామకృష్ణ నిధులుభూబదలాయింపు అంశాల్లో కేటీఆర్ అబద్ధాలుచెబుతున్నారు

 

కంటోన్మెంట్ అభివృద్ధి లో నాదే పాత్రరామకృష్ణ

కంటోన్మెంట్ జనం సాక్షి : కూకట్‌పల్లి మురుగు నీటి ప్రవాహం కోసం చేపట్టే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైను వల్ల కంటోన్మెంట్‌కు ఏం లాభమంటూ బోర్డు నామినేటెడ్ సభ్యుడు జె.రామకృష్ణ ప్రశ్నించారు.ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసిందంటూ బీఆర్‌ఎస్‌ నేతలు పప్పు పరమానంద శిష్యులు పెట్టుకొన్ని సంబురాలు చేసుకోడం విడ్డూరంగా ఉందన్నారు.ఈ మేరకు రామకృష్ణ బోర్డు కార్యాలయంలో పత్రిక విలేకరులతో మాట్లాడుతూ కూకట్‌పల్లి మురుగునీటి ప్రవాహం కోసమే కంటోన్మెంట్‌లో ప్రత్యేక డ్రైనేజీ లైను వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చారని అన్నారు. ఇందుకు సంబంధించి రూ.30 కోట్లు ఎస్‌ఎన్‌డీపీ ద్వారా విడుదల అయ్యాయంటూ బీఆర్‌ఎస్‌ నేతలు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.రామన్నకుంట చుట్టూ రింగ్‌ సీవరేజీ కూడా కూకట్‌పల్లి మురుగు ప్రవాహం కోసమే చేసుకున్నామని,కంటోన్మెంట్‌కు చేసిందేమీ లేదన్నారు.రాష్ట్రమంత్రి కేటీఆర్ గాలి మాటలు నమ్మే పరిస్థితిలో తాము లేమన్నిఇక తిరుమలగిరి చెరువు అభివృద్ధి పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమీ లేదన్నారు. కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులతోనే ఈ పనులు చేపడుతున్నామన్నారు.నిధులు విడుదల చేస్తామంటూ కేటీఆర్‌ చెప్పాడని పేర్కొనడం మరీ విచిత్రంగా ఉందన్నారు. నిధులు విడుదలయ్యేంత వరకు తాము నమ్మబోమంటూ రామకృష్ణస్పష్టీకరించారు. భూబదలాయింపు మొదలుకొని వివిధ అంశాల్లో కేటీఆర్‌ చెబుతున్న అబద్ధాలతో రక్షణ శాఖ ఉన్నతాధికారుల వద్ద కూడా కేటీఆర్‌కు విశ్వసనీయత లేకుండా పోయిందన్నారు.తాను కోర్టుకెళ్లడం ద్వారానే కంటోన్మెంట్‌కుఉచితనీరు,టీపీటీనిధులువిడుదలయ్యాయన్నార.ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్‌కు ఇవ్వాల్సిన రూ.37 కోట్ల టీపీటీ నిధులు విడుదల కాలేదన్నారు. బీఆర్‌ఎస్‌ ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్న నేత పప్పుకు కంటోన్మెంట్‌ ప్రాంత సమస్యలపై అవగాహన లేదని రామకృష్ణ అన్నారు. ప్రైవేటు స్థలంలో ఉన్న పెద్ద కమేళాను భూబదలాయింపు జాబితాలో చేరుస్తామనడం,బజార్‌ ల్యాండ్‌లను క్రమబద్ధీకరిస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.108 బజార్,మడ్‌ఫోర్ట్‌ హట్స్‌, చిన్నకమేళా వంటి రక్షణ స్థలాల్లోని భూముల బదలాయింపునుక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తే, తాను రక్షణ శాఖ అధికారులను ఒప్పిస్తానంటూ సవాలువిసిరారు. కంటోన్మెంట్‌లో సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదంటున్న బీఆర్‌ఎస్‌ నేతలు, జీహెచ్‌ఎంసీలో పరిస్థితిని సమీక్షించుకోవాలన్నారు. అక్కడ పెద్ద మొత్తంలో ఆస్తులు తనఖా పెట్టి, దివాళా తీయిస్తున్నారని అన్నారు. సర్వీసు చార్జీలు కేంద్ర బకాయిలు కాదని, స్థానిక ఆర్మీ అధికారులు చెల్లించాల్సిన చార్జీలు అన్నారు. ఈ మాత్రం అవగాహన లేకుండా కేంద్రాన్ని విమర్శిస్తే ఎలా అని ప్రశ్నించారు. కంటోన్మెంట్‌ల విలీన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ వాయిదా పడుతూ వచ్చిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పనులు చేస్తానంటే తాము అడ్డు పడుతున్నామని అబద్దాలు చెప్పడం సరికాదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే డ్రైనేజీ పనులకు ఎన్‌ఓసీ ఇచ్చామన్నారు. రహదారుల మూసివేత విషయంలో కేంద్రం పాలసీకి అనుగుణంగానే చర్యలు తీసుకున్నారు తప్పఅన్ని ప్రశ్నించారు,ఈ విషయంలో బీఆర్‌ఎస్‌ నేతలు చేసిందేమీ లేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు .

తాజావార్తలు