బేగంపేటలో డబుల్ బెడ్ రూంల ఇండ్ల నిర్మాణం ఎప్పుడు..? – భూమి పూజ చేసి వదిలేసారని బిజెపి నాయకుల

 ధ్వజం జనంసాక్షి , రామగిరి : రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపు, చందుపట్ల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కడతామని గత కొన్ని సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూమి పూజ చేసిన స్థలాన్ని బిజెపి నాయకులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేసి నిర్మాణాలను మర్చిపోయారని అన్నారు. రామగిరి మండలం బేగంపేట గ్రామంలో పేద ప్రజల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కడతామని టిఆర్ఎస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉందన్నారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి అని కూడా చెప్పి ఇప్పటివరకు ఒక ఎకరా కూడా ఇవ్వని ప్రాంతం మంథని ప్రాంతం అని, రాబోయే రోజుల్లో మంథని నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేస్తాం..రాష్ట్రం లో, కేంద్రంలో సైతం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడే అవినీతి లేని పాలన పేద ప్రజలకు అందవలసిన పథకాలు కూడా సక్రమంగా అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రామగిరి మండల బిజెపి సీనియర్ నాయకులు మొలుమూరి శ్రీనివాస్, బేగంపేట గ్రామ అధ్యక్షులు బిజెపి ఊదరి కొమరయ్య ,బిజెపి మండల నాయకులు తీగల శ్రీధర్, యువమోర్చా నాయకులు రేణిగుంట్ల విజయ్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్థలాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు.

తాజావార్తలు