బొగ్గు కేటాయింపులపై న్యాయ విచారణ జరిపించాలి: సురవరం

న్యూఢిల్లీ: గతంలో ఎన్నడూ లేని విధంగా యూపీఏ-2 హయాంలో రూ.ఐదు లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సరువరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. బొగ్గు కుంభకోణంపై పార్లమెంటులో భాజపా వ్వవహార శైలినీ ఆయన దుయ్యబట్టారు. బొగ్గు కుంభకోణంపై పార్లమెంటులో భాజపా వ్వవహారశైలి సరిగా లేదన్నారు. పార్లమెంటుని గౌరవించాల్సి అవసరం ఆ పార్టీకి ఉండాలని, బొగ్గు కేటాయింపులపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. యూపిఏ ప్రభుత్వం దివాలకోరు విధానలను కోర్టులు, కాగ్‌ ఎత్తిచూపుతున్నాయని, బొగ్గు కేటాయింపులపై ప్రధాని మన్మోహన్‌ నైతిక బాధ్యత వహించాలని కోరారు. యూపీఏ-2 హయాంలో మొత్తం రూ.5 లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. దీనిపై పూర్తిగా న్యాయ విచారణ చేయాలి అని సురవరం అన్నారు. పార్లమెంటులో భాజపా నియంతృత్వ పోకడలో వెళ్తోందని, ఆ పార్టీ పార్లమెంటును గౌరవించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. అదే సమయంలో ప్రధాని కూడా నైతికంగా వ్యవహరించాలి అని సురవరం పేర్కొన్నారు.

తాజావార్తలు