బొగ్గు గనుల కేటాయింపులో మన్మోహన్‌సింగ్ ప్రకటన వేచిచూద్దాం
చెన్నై: బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని కాగ్ తమ నివేదికలో పేర్కొన్న విషయంపై ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటనకు వేచి చూద్దామని కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌శౌరి పేర్కొన్నారు. నగరంలో శనివారం ఓ కర్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ అంశానికి సంబంధించి విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష భాజపా గతంలో 2జీ స్పెక్ట్రం కుంభకోణం విషయంలో ఆర్థికమంత్రి చిదంబరం రాజీనామా చేయాలని అయిదు రోజులపాటు సమావేశాన్ని బహిష్కరించినప్పటికీ సాధించింది మృగ్యమేనని వ్యాఖ్యానించారు. ఇక విదేశాలలో పాతుకుపోయిన మన దేశ నల్లధనాన్ని వెనక్కి తీసుకువచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తున్న దాఖలాలు కన్పించడంలేదని అరుణ్‌శౌరి పేర్కొన్నారు.