బ్యాంకర్లపై చంద్రబాబు ఆగ్రహం

 chandrababu-naiduపెద్దనోట్ల రద్దుతో తలెత్తిన సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారంటూ బ్యాంకర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారంలో బ్యాంకర్లకు బాధ్యత లేదా? అంటూ నిలదీశారు. బ్యాంకర్ల పనితీరుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఆయన ఫిర్యాదు చేశారు. మరో మూడురోజుల్లో ఉద్యోగులకు జీతాలు, పింఛన్ల చెల్లింపులు చేయాల్సి ఉండటంతో బ్యాంకర్లతో విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సోమవారం ఆయన సుదీర్ఘంగా చర్చించారు. పెద్దనోట్లను రద్దుచేసి మూడువారాలు గడిచినా ఇప్పటికీ బ్యాంక్‌ల వద్ద, ఏటిఎంల వద్ద నిలబడి ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారన్నారు. రాష్ట్రంలో 75 నుంచి 80 వేల కోట్ల రూపాయలను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే ఇప్పటివరకూ 6 వేల కోట్ల రూపాయలు మాత్రమే కొత్త నోట్ల పంపిణీ జరిగిందన్నారు. ఇంత వ్యత్యాసం ఉంటే ప్రజల జీవన విధానంపై ప్రభావం చూపదా? అంటూ ప్రశ్నించారు. 1000 కోట్ల రూపాయల మేరకు చిన్ననోట్లు పంపాలని ఆర్‌బిఐకి చంద్రబాబు లేఖ రాయనున్నారు.

తాజావార్తలు