బ్యాంకుల జాతీయకరణ కన్నా ఈ సంస్కణ గొప్పదా?

అనంతపురం,నవంబర్‌11(జ‌నంసాక్షి): కేవలం నోట్ల రద్దు గురించి బీజేపీ గొప్పగా ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందని పిసిసి నేతలు అన్నారు. బ్యాంకుల జాతీయకరణ చేసి బ్యాంకింగ్‌ వ్యవస్థను ప్రజల ముందుకు తీసుకువచ్చిన కాంగ్రెస్‌ ఇక ఎంత గొప్పగా చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఆనాడు ఇందిర బ్యాంకులను జాతీయం చేసి ప్రజలకు మేలుచేసిందన్నారు. ఇంతకన్నా గొప్పదా ఈ పని అని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే నోట్ల రద్దు వ్యవహారం ముందుకొచ్చిందని ఆరోపించారు. స్విస్‌ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని బయటకు తెస్తామని ప్రగల్భాలు పలకడంతో పాటు అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరి ఖాతాలో వంద రోజుల్లో రూ. 15 లక్షలు వేస్తామని బీజేపీ హావిూ ఇచ్చిందన్నారు. దానిపై ప్రజల నుంచి నిరసన వస్తుండడంతో మరిపించేందుకే పెద్ద నోట్లు రద్దు చేశారని ధ్వజమెత్తారు.

స్విస్‌ బ్యాంకు, విదేశాల్లో రూ. 80 లక్షల కోట్ల నల్లధనం ఉ న్నట్లు అంకెలు చెబుతున్న కేంద్రం దేశంలో ఎంత నల్లధనం ఉందనే విషయాన్ని స్పష్టం చేయడం లేదన్నారు. గతంలో నోట్ల రద్దును 15 రోజుల ముందే ప్రకటించి చేసే వారన్నారు. నోట్లు రద్దుతో ఏడాది కాలంలో బంగారం, భూములు, భారీ ఆర్థిక లావాదేవీలు, ఫ్యాక్టరీల ఏర్పాటు వంటి వాటిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేసి వాస్తవాలు బయటకు తెస్తే నోట్ల రద్దు వ్యవహారం గుట్టు రట్టవుతుందన్నారు.

తాజావార్తలు