బ్రేక్‌ దర్శనాల్లో కోత

తిరుమల,ఏప్రిల్‌18(జ‌నంసాక్షి): ఇక తిరుమల విఐపి బ్రేక దర్వనాలు కేవలం ప్రోటోకాల్‌ అధికారులకు మాత్రమే దక్కేలా మెల్లగా ప్రణాళిక ప్రకారం టిటిడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్టపికే వేసవిలో బ్రేక దర్వనాలు వారికి మాత్రమే పరిమితం చేశారు. ఇకపోతే  శుక్రవారం నుంచి జూలై 16వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను టీటీడీ కుదించింది. కేవలం ప్రొటోకాల్‌ వర్తించే ప్రముఖులకే దర్శన టిక్కెట్లు కేటాయించనుంది. వేసవి రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఈవో శ్రీనివాసరాజు స్పష్టంచేశారు. వీఐపీ దర్శనాలను కుదించిన ఈ రోజుల్లో సిఫారసులను స్వీకరించేది లేదని జేఈవో తేల్చిచెప్పారు. వేసవి సెలవులు, పరీక్ష ఫలితాల వెల్లడి తర్వాత తిరుమలకు భక్తుల రద్దీ అనూహ్యంగా ఉంటుందన్నారు. ఈ క్రమంలో జూలై వరకు ప్రత్యేక ఏర్పాట్లతో ప్రణాళిక రూపొందించామని తెలిపారు.

తాజావార్తలు