భద్రకాళి చెరువుకు గండి పడింది
వరంగల్ ఈస్ట్ జూలై 29 (జనం సాక్షి)
వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి చెరువుకు గండిపడిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రకాళి చెరువుకు వరద నీరు చేరడంతో నిండుకుండలా మారిన సంగతి తెలిసిందే. అయితే హఠాత్తుగా భద్రకాళి చెరువు కట్ట తెగి నీరు ఉదృతంగా ప్రవహిస్తున్న సంగతి ప్రజలను ఆందోళన గురిచేస్తుంది ముఖ్యంగా పోతన నగర్, సరస్వతీ నగర్, కాపువాడ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. క్రమంలో నీరు ఉదృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వారు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను ముంపు ప్రాంత ప్రజలను స్థానిక పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు అంతేకాకుండా కట్టను పరిశీలించడంలో ఇరిగేషన్ అధికారులు అలసత్వం వహించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.