భారత్ ఘన విజయం
బెంగుళూరు: భారత్,న్యూజిలాండ్‌ల మధ్య బెంగుళూరులో జరిగిన రెండో టెస్టులో ధోని సేన ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్‌పై అయిదు వికెట్ల తేడాతో విజయ సాదించింది. రెండో ఇన్నిగ్స్ 232/9 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగు రోజు బరిలోకి దిగిన కివీన్ 248 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. జోరు మీదున్న వీరి జోడీని పటేల్ విడగొట్టాడు. 38 పరుగులు చేసిన సెహ్మావగ్ పటేల్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 77 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత కొద్దిసేపటికే గంభీర్(34) కూడా పెవిలియన్‌కు చేరాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన పుజారా నిలకడగా ఆడగా, సచిన్ (27) మరోసారి నిరాశ పరిచాడు. 48 పరుగులతో పుజారా నిలకడగా అడగా, సచిన్ (27) మరోసారి నిరాశ పరిచాడు. 48 పరుగులతో నిలకడగా రాణిస్తున్న పుజారా పటేల్ బౌలింగ్‌లో ఫ్లిన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో మెరుపులు మెరిపించిన రైనా డకౌటాయ్యాడు. మరోపక్క కోహ్లీ(51) పరుగులు రాబాట్టాడు. ఇతనికి కెప్టెన్ ధోని(48) తోడవడంతో మరో రోజు ఆట మిగిలి ఉండగానే భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. దీంతో టీం ఇండియా రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీవ్ చేసింది. కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎంపికవగా, రవిచంద్ర అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.