భారత్‌, చైనాలకు ఉద్యోగాలు తరలిపోకుండా ఒబామా యంత్రాంగం

వాషింగ్టన్‌: ఆమెరికా నుంచి భారత్‌, చైనాలకు ఉద్యోగాలు తరలిపోకుండా ఒబామా యంత్రాంగం విశ్వప్రయత్నాలు చేస్తోంది. తయారీ రంగంలో ఉద్యోగాలు భవిష్యత్తులో చైనా లేదా భారత్‌ వంటి దేశాలకు తరలిపోకుండా తయారీ అవిష్కరణల సంస్థ సహాయపడుతుంది. తద్వారా దేశ పౌరులకు ఉపాధి కల్పించడంతోబాటు పటిష్ఠమైన ఆర్ధికరంగాన్ని నిర్మిస్తాం, అని అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటయ్యే ఈ సంస్థకు ప్రాధమికంగా సుమారు రూ.385 కోట్ల (70మిలియన్‌ డాలర్లు) ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.

తాజావార్తలు