భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి

భైంసా జనం సాక్షి జూలై27- తెలంగాణ జన సమితి ముధోల్ నియోజకవర్గ ఇంచార్జీ సర్దార్ వినోద్ కుమార్.రెండు రోజులు ఎడ తెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని TJS నియోజకవర్గ ఇంచార్జీ సర్దార్ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు అలాగే నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో మరియు గ్రామాల్లో పంట పొలాల మునక వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం రైతాంగానికి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాలని,అలాగే గ్రామాల్లో చాలా వరకు ఇళ్లు కూలీ పోయి పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు అలాగే గత సంవత్సరం వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేని KCR ప్రభుత్వం, ఇప్పుడు ప్రాథమిక అంచనాల పేరుతో స్థానిక అధికారులు, ఎంఎల్ఏ హడావుడి చేయడం హాస్యాస్పదం అన్నారు. అలాగే ఎకరాకు 25 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరుడు జరిగిన పంట నష్టాన్ని సర్వేలు చేసిన వాళ్లు ఇప్పటి వరకు ఎందుకు నష్ట పరిహారం ఇవ్వలేదో తమ గ్రామానికి వచ్చినపుడు స్థానిక ఎంఎల్ఏ కు ప్రజలు నిలదీయలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు..

తాజావార్తలు