భారీ వర్షాలకు ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి – కల్వచర్ల సర్పంచ్ గంట పద్మ వెంకట రమణా రెడ్డి
జనంసాక్షి, రామగిరి : రాష్ట్రవ్యాప్తంగా గత 4 రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కల్వచర్ల సర్పంచ్ గంట పద్మ వెంకట రమణా రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సూచనల మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యా సంస్థలకు, కళాశాలలకుసెలవులు ప్రకటించనందున విద్యార్థులు చెరువులు, కుంటలు, వాగులు, కరెంట్ స్తంభాల దగ్గరికి వెళ్లకుండా తల్లిదండ్రులు వారి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. అదే విధంగా రైతు సోదరులు కూడా బోరు బావి దగ్గర, పిడుగులు పడే ప్రదేశంలో ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసరం ఉంటే తప్ప ఇంట్లో నుంచి బయటికి రాకుండా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలని గ్రామ ప్రజలను కోరారు.