భారీ వర్షాల కారణంగా కరెంట్ స్థంభాలు ముట్టుకోవద్దు : ఎస్ఐ రాజశేఖర్ – అంతారంలో సర్పంచ్ శంకర్ తో కలిసి అవగాహన కార్యక్రమం

మునిపల్లి, జూలై 27, జనంసాక్షి :
భారీ వర్షాల కురుస్తున్నందున ప్రజలు ఎవరు కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ఫర్మార్లను ముట్టుకోరాదని మునిపల్లి మండలం ఎస్ఐ రాజశేఖర్ చెప్పారు. గురువారం నాడు పోలీస్ సిబ్బంది, గ్రామం సర్పంచ్ శంకర్ తో కలిసి అంతారం గ్రామంలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తుండటంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, రిజర్వాయర్లు, చెరువుల దగ్గరకు వెళ్లొదని గ్రామస్తులకు సుంచించారు. చెట్ల కింద, పాడైన బంగ్లాల దగ్గర, శీధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాడని తెలిపారు. వర్షాలకు వాహనాలు కూడా జాగ్రత డ్రైవింగ్ చేయాలనీ పేర్కొన్నారు. అతివేగంగా వాహనాలు నడిపిస్తే స్కిడ్ అయ్యి ప్రమాదాల జరిగే అవకాశం ఉందని చెప్పారు. పెద్ద పెద్ద వర్షాలు కురుస్తున్న సమయంలో ఇళ్లల్లో నుంచి బయటికి రావొద్దని ఎస్ఐ తెలిపారు. తగిన జాగ్రత్తలు తీస్కోకుంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

తాజావార్తలు