భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – మంథని ఎమ్మెల్యే దుదిల్ల శ్రీధర్ బాబు
జనంసాక్షి, మంథని : ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా తగు చర్యలు సకాలంలో చేపట్టాలని మంథని నియోజకవర్గములోని భూపాల్ పల్లి పెద్దపల్లి జిల్లాల అధికారులకు మంథని ఎమ్మెల్యే దుదిల్ల శ్రీధర్ బాబు సూచించారు. భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్పా బయటకు రావద్దని, కరెంటు స్తంబాలకు, డ్రైనేజీ గుంతలకు దూరంగా ఉండాలని ఉన్నారు. భారీ వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించినందున ప్రజలు అప్రమంతంగా ఉండాలని, వ్యవసాయదారులు జాగ్రత్తలు పాటించాలన్నారు. దుద్దిల్ల శ్రీధర్ బాబు భూపాల్ పల్లి మరియు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అధికారులకు సూచించారు. గోదావరినదీ ప్రవాహం పెరగడంతో గోదావరి, మానేరు పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటువైపు వెళ్ళకూడదని కోరారు. పురాతన బ్రిడ్జిల మీద నుండి రవాణా చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ ప్రజలను కోరారు. గ్రామాల్లో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి ముందస్తు సమాచారం అందించాలని అన్నారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రజలకు సహయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.