భూకుంభకోణం నిందితుడు సర్వేయర్ ఇంటిపై ఎసిబి దాడులు
అనూహ్యంగా అధికారులపై కుక్కలతో దాడి
విశాఖపట్టణం,నవంబర్18(జనంసాక్షి): విశాఖ భూకుంభకోణంలో నిందితుడు, మాజీ సర్వేయర్ గేదెల లక్ష్మీగణెళిశ్వరరావు ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ దాడులు చేపట్టగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. గణెళిశ్వర రావు కొడుకు అనూహ్యంగా తన పెంపుడు కుక్కలను అధికారులపై ఉసిగొల్పారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇదిలావుంటే శనివారం ఉదయం నుంచి ఏకకాలంలో విశాఖ జిల్లాలోని 17 చోట్ల, నగరంలో 11 చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు సీతంపేటలో గణెళిశ్వరరావు బంధువు పేరిట 5 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నట్లు ఎసి బి అధికారులు గుర్తించారు. వివిధ చోట్ల 7 ప్లాట్లు ఉన్నట్లు తేల్చారు. శ్రీనగర్‌లో గణెళిశ్వరరావు నివాసం ఉంటున్న సువర్ణ రెసిడెన్సీ 3వ అంతస్తు 303 ఎ/-లాటులో అ.ని.శా డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో అధికారులు సోదాలు జరుపుతున్నారు. అయితే ఈ సందర్భంగా గణెళిశ్వరరావు, అతని కొడుకు అధికారులపై ఎదురుదాడికి దిగారు. డీఎస్పీ రమాదేవి పోలీసులతో తన ఎడమ భుజంపై కొట్టించారని ఫలితంగా తన భుజానికి గాయమైందని గణెళిశ్వరరావు ఆమెపై ఆరోపించాడు. ఒక దశలో గణెళిశ్వరరావు కొడుకు తన రెండు కుక్కలను అధికారులు, విలేకర్లపై విడిచిపెట్టాడు. దీంతో డీఎస్పీ అతన్ని మందలించారు. డీఎస్పీ ఫిర్యాదు మేరకు 4వ పట్టణ సీఐ రాంబాబు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని అధికారులకు రక్షణగా నిలిచారు. దాడుల్లో వెండి సామాగ్రి, బంగారు ఆభరణాలు, వివిధ స్థిరాస్తి పత్రాలు, ఎక్కువ మొత్తంలో బ్యాంకు పాస్ పుస్తకాలు, విదేశీ కరెన్సీ, ర్దదైన రూ.500, రూ.1,000 నోట్లు, ఖరీదైన చీరలు లభ్యమయినట్లు సమాచారం. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం సొమ్మును లంచాలుగా తింటూ కోట్లకు పడగలెత్తినట్లు గుర్తించారు. విజయనగరం జిల్లాలో సర్వే విభాగం ఇన్‌స్పెక్టర్ లక్ష్మీగణెళిశర్వరరావు ఆస్తులపై ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహిస్తున్నారు. ఆయాయానికి మించి ఆస్తులున్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు 17 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు దాడులు చేశారు.
హైదరాబాద్, విశాఖపట్నం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని లక్ష్మీ గణెళిశ్వరరావు
బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. కాగా లక్ష్మీ గణెళిశ్వరరావుపై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన్ను ఉన్నతాధికారులు విధుల నుంచి తప్పించారు.