భూముల కొనుగోలుతో గిరిజనులకు అన్యాయం
ఏలూరు,ఏప్రిల్20(జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో 1/70 చట్టం పరిధిలో ఉన్న భూముల కొనుగోలును నిలుపుదల చేయాలని గిరిజన సంఘం నాయకులు అన్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పన కోసం బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో సుమారు 3500 ఎకరాల భూమిని గిరిజనేతర రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని అన్నారు. అందులో 500 ఎకరాలు గిరిజనులు సాగు చేస్తున్నారని అన్నారు. కేవలం పట్టాలు ఉన్న భూములను మాత్రమే కొనుగోలు చేసి గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. ఇదిలావుంటే
జిల్లాలో రైతులకు ఆధునిక యంత్ర పరికరాలను అందించి అధిక దిగుబడి సాధించేలా సమగ్ర ప్రణాళిక అమలుచేస్తామని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించడం కోసం ఇప్పటినుంచే తగిన కార్యాచరణ అమలు చేస్తామన్నారు.