భూరికార్డుల ప్రక్షాళనతో సమస్యలకు చెక్‌

యాదాద్రి భువనగిరి,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): భూసమస్యల పరిష్కారం కోసమే భూరికార్డుల ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టిందని ఆలేరు ఎమమెల్యే గొంగిడి సునీత అన్నారు. సర్వేతో గ్రామాల్లో ఇప్పుడు అన్ని బూముల వివరాలు తెలుస్తున్నాయని అన్నారు. భూరికార్డుల ప్రక్షాళనను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

పలువురి పట్టాదారు రైతుల భూముల సర్వే నంబర్లు, భూముల వివరాలను పరిశీలించారు. డిసెంబర్‌ 15 వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. గ్రామ సభలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ భూములు, చెరువు శిఖం వంటి భూములు గుర్తించి హద్దులను నిర్ణయిస్తామని తెలిపారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను రెండో విడుతలో పరిష్కారానికి కృషి చేయనున్నామని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న భూరికార్డుల ప్రక్షాళనలో భూములు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ భూముల వివరాలు సరిచేసుకోవాలని అన్నారు. ఎలాంటి భూ సమస్యలున్న దరఖాస్తు చేసిన వెంటనే పరిష్కారం చేయడం జరుగుతుందని సూచించారు.

తాజావార్తలు