-->

మండలంలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

రాజోలి 15 ఆగస్టు(జనం సాక్షి)
మండలంలో ఆదివారం పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజోలి లోని ఆన్నీ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రయివేట్ పాఠశాలలు జెండా పండుగను పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేశారు. ఆజాది కా అమృత మహోత్సవ్ విశిష్టత ను తెలియచేశారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అసువులు బాసిన అమరులను గుర్తు చేసుకున్నారు. దేశ ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.
పచర్లలో…
మండలంలోని పచర్ల గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న చెరువు సమీపంలో జెండాను ఎగురవేశారు.కాగా ఆర్మీ లో జవాన్ గా విధులు నిర్వహిస్తున్న వినోద్ తో జెండాను ఎగరవేయటం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోవింద్ రావ్,తహసీల్దార్ శ్రీనివాస్ శర్మ,si లెనిన్ తదితరులు పాల్గొన్నారు