మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా వీరభద్రుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి

కేటీఆర్‌ పుట్టినరోజును ఘనంగా నిర్వహించిన మంత్రి సత్యవతి రాథోడ్

డోర్నకల్/ కురవి, జూలై -24 జనం సాక్షి న్యూస్:
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ 47వ పుట్టినరోజు సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక పూజలు చేశారు. కేటీఆర్, వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద మంత్రి అర్చన, అభిషేకాలు చేసారు. మంత్రి కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ….కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వారు ప్రారంభించిన గిఫ్ట్‌ ఏ స్మైల్‌ ప్రతి ఏడాది ఎంతో మందికి చేయూతను అందిస్తున్నారని తెలిపారు.దీన్ని స్ఫూర్తిగా తీసుకొని
బీఆర్‌ఎస్‌ నేతలు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అని ఆమె అన్నారు.ఈ ఏడది గిఫ్ట్‌ ఏ స్మైల్‌ భాగంగా స్టేట్ హోంలోని అనాథ పిల్ల‌ల‌కు త‌న వంతు సాయం చేయాల‌ని నిర్ణ‌యించుకుని, 47వ పుట్టిన రోజు సంద‌ర్భంగా.. గిఫ్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో భాగంగా 10, 12వ త‌ర‌గ‌తుల్లో ప్ర‌తిభావంతులైన 47 మంది పిల్ల‌ల‌కు, ప్రొఫెష‌న‌ల్ కోర్సుల నుంచి మ‌రో 47 మంది పిల్ల‌ల‌కు వ్య‌క్తిగ‌తంగా అండ‌గా నిలిచారు.వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.సీఎం కేసీఆర్‌ రైతులకు కొండంత అండగా నిలిచి అన్ని విధాలుగా ఆదుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్ట‌గొట్టేందుకు చూస్తుంది.స్వ‌రాష్ట్రంలో పుష్క‌లంగా సాగునీరు, నాణ్య‌మైన నిరంత‌ర క‌రెంట్ స‌ర‌ఫ‌రాతో ఆర్థికంగా ఎదుగుతున్న రైతుల‌ను మళ్లీ చీక‌ట్లోకి నెట్టేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని అన్నారు.
తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్‌ నేతలు శత్రువులు.
కాంగ్రెస్ నిజ స్వరూపం ఏమిటో ఆయన వ్యాఖ్యలతో బయట పడింది.అసలు పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డికి వ్యవసాయంపై అవగాహన ఉందా ?
ముఖ్యమంత్రి కేసీఆర్‌నాయకత్వంలో సరిపడా సాగునీరు, ఉచిత విద్యుత్‌, పంటపెట్టుబడి వంటి పథకాల అమలుతో తెలంగాణ దేశానికి ఆదర్శంగా సస్యశ్యామలంగా నిలిచిందన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కుమారి అంగోత్ బిందు, కురవి జడ్పిటిసి బండి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కొమ్మి నేని రవీందర్, గుగులోత్ శ్రీరాం నాయక్, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, మన్యు, కొంపెల్లి శ్రీధర్ రెడ్డి,బాదే నాగన్న, నరహరి,గుగులోత్ నెహ్రూ నాయక్,డా.సుందర్ నాయక్,బోడ శ్రీను,కొప్పుల వెంకట్ రెడ్డి,హాచ్య నాయక్, అర్జున్ చౌహాన్, తొట్టి శ్రీను, బొమ్మ కంటి వెంకట్, బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు