మంత్రి కేటీఆర్ సూటిగా సమాధానం చెప్పాలి.

కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి.

వినోద్ కుమార్ చిన్న బోనాల చెరువులను చూపిస్తామని సవాల్

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 3.,(జనంసాక్షి). అధికార యంత్రాంగాన్ని అదుపులో ఉంచుకున్న విషయంలో మంత్రి కేటీఆర్ సూటిగా సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులతో కలిసి మాట్లాడారు. మంత్రి కేటీఆర్ తాము ఎక్కడ అధికారులను వాడుకోలేదని మాట్లాడంపై విస్మయం వ్యక్తం చేశారు. తంగళ్ళపల్లి మండలంలోని రాజకీయంగా ఎదుగుతున్న మునిగేల రాజు తండ్రి పై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై వేధింపులు జరుగుతున్నాయని అన్నారు. జిల్లాలో జరిగిన రెవెన్యూ, పోలీస్ శాఖ బదిలీలను చూస్తే అర్థమవుతుందని ఈ విషయంలో మంత్రి కేటీఆర్ సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ మాట్లాడిన వీడియోలను చూపించారు.నియోజకవర్గ మంత్రిగా కేటీఆర్ కనీసం వరద బాధితులను పరామర్శించకపోవడంపై మాట్లాడుతూ సిరిసిల్లప్రజలపై ప్రేమ లేదా అని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ చేసిన విమర్శలపై మండిపడ్డారు. జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గలలో చెరువులకు గండ్లు పడిన విషయం వినోద్ కుమార్ కు తెలియకపోవడం బాధాకరమని అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని వరద బాధిత ప్రాంతాల్లో గండి పడ్డ చిన్న బోనాల కొత్తచెరువు చూపించేందుకు తమ సిద్ధంగా ఉన్నామని దమ్ముంటే రావాలని అన్నారు. వేములవాడ నియోజకవర్గంలో కూడా కథలాపూర్ మండలం తో పాటు పలు ప్రాంతాల్లో చెరువులు గండ్లు పడి తెగిపోయాయని అన్నారు. తెలుసుకొని విమర్శలు చేస్తే మంచిదని తెలిపారు. సమావేశంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, అన్నదాస్ భాను, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు