మంథనిలో ఎస్ఎఫ్ఐ బంద్ విజయవంతం – ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ల సందీప్

జనంసాక్షి, మంథని : తెలంగాణ రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ లో భాగంగా బుధవారం మంథనిలో బంద్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ల సందీప్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం సిగ్గుచేటనే అన్నారు.దశాబ్ది ఉత్సవాల పేరిట కోటానుకోట్ల రూపాయలను వృధా చేసిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కూడా నోట్ బుక్స్, రెండు జతల దుస్తులను వెంటనే పంపిణీ చేయాలని అన్నారు. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు చూస్తుందని అన్నారు. ప్రభుత్వ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించకుండా వారికి మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. హాస్టళ్లకు పక్కా భవనాలు కట్టించకుండా అద్దె భవనాలు ఇంకెన్నాళ్లు కొనసాగుతాయని అన్నారు ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వసూలు చేస్తూ ఉంటే అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజులు నియంత్రణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాగర్, రాజకుమార్, అఖిల్, సురేష్, వినోద్, రోహిత్, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు